One Nation One Election: ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’పై కమిటీ.. చైర్మన్‌గా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఈ కమిటీని ఏర్పాటు చేయడం గమనార్హం. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి శుక్రవారం కమిటీ ఏర్పాటు గురించి వెల్లడించారు.

Ram Nath Kovind: ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’పై ఎనిమిది మంది సభ్యులతో కూడిన కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు న్యాయ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా దేశంలో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం ఉపయోగకరమని ఈ సందర్భంగా ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలో, ఏకకాల ఎన్నికలను నిర్వహించే అంశాన్ని పరిశీలించడానికి భారత ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది.

Maratha Reservation: మళ్లీ మొదలైన మరాఠా రిజర్వేషన్ పోరు.. జల్నాలో తీవ్ర ఘర్షణ, 42 మంది పోలీసులకు గాయాలు

ఈ కమిటీకి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నాయకత్వం వహిస్తారని న్యాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కమిటీలో హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి, రాజ్యసభలో మాజీ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్, ఫైనాన్స్ కమిషన్ మాజీ చైర్మన్ ఎన్‌కే సింగ్, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ సీ కశ్యప్, సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారి ఉన్నారు.

Typhoon Saola: 50 కిలోల కంటే తక్కువ బరువు ఉన్నవారు బయటికి రావొద్దని చైనాలో ఆదేశాలు.. ఎందుకో తెలుసా?

న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఉన్నతస్థాయి కమిటీ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరవుతారని నోటిఫికేషన్‌లో ప్రభుత్వం పేర్కొంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఈ కమిటీని ఏర్పాటు చేయడం గమనార్హం. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి శుక్రవారం కమిటీ ఏర్పాటు గురించి వెల్లడించారు.