దమ్ముంటే దెందులూరులో పోటీ చేయాలి : జగన్ కు చింతమనేని సవాల్

  • Publish Date - February 24, 2019 / 02:29 PM IST

విజయవాడ: జగనుకు దమ్ముంటే నా నియోజకవర్గంలోకి వచ్చి పోటీ చేయాల దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్  చింతమనేని ప్రభాకర్ సవావ్  విసిరారు. జగన్ దివాళకోరు రాజకీయాలు చేస్తున్నారని, నన్ను దళిత వ్యతిరేకిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.  దళిత సంఘాలు నా నియోజకవర్గంలో పర్యటిస్తే నేను దళిత వ్యతిరేకినో, దళిత పక్షపాతినో తేలుతుందని చెప్పారు. “నాకు కులాన్ని ఆపాదించడం వైసీపీ తరం కాదు. జర్నలిజం అనే వృత్తిని వైసీపీ అవహేళన చేస్తోంది. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు జగన్ పై ఫిర్యాదు చేస్తానని చింతమనేని ప్రభాకర్ తెలిపారు.

తమ కుట్రలకు వారి వద్ద పని చేస్తున్న వారిని కూడా పురికొల్పుతూ వారినీ ఇబ్బంది పెడుతున్నారని చింతమనేని అన్నారు. రెండున్నర  నిమిషాల వీడియోను ఎడిట్ చేసి 30 సెకండ్ల వీడియోనే వైరల్ చేశారు. 30 సెకండ్ల వీడియో చూసి ఎవరి మనోభావాలైనా దెబ్బ తినుంటే క్షమాపణలు కోరుతున్నాను. నన్ను అడ్డం పెట్టి కొందరి మనోభావాలను దెబ్బ తీసే ప్రయత్నం చేశారు కాబట్టి, నా తప్పు లేకున్నా క్షమాపణ చెబుతున్నాని ప్రభాకర్ చెప్పారు.  

తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకుని శవ రాజకీయాలు చేసే చరిత్ర జగన్ది అని చింతమనేని ఆరోపించారు. వైఎస్ చనిపోయాక సాధారణ మరణాలను కూడా లెక్కల్లోకి తీసుకుని ఓదార్పు చేసినోడు జగన్ అని అన్నారు. వైఎస్ చనిపోతే వందలాది మంది చనిపోయారని చెప్పిన జగన్  తండ్రి చనిపోతే ఎందుకు ఘటనా స్ధలానికి వెళ్లలేదని ప్రశ్నించారు. బీదలకు నేను చేసే సాయం ఏంటో దెందులూరుకు వస్తే తెలుస్తుందని చింతమనేని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు