జగన్ పై దాడి కేసు : డీజీపీ, అడ్వకేట్ జనరల్ తో చంద్రబాబు భేటీ   

  • Publish Date - January 5, 2019 / 04:14 PM IST

అమరావతి : వైసీపీ అధినేత జగన్ పై కోడి కత్తి దాడి కేసు వివాదం ముదురుతోంది. జగన్ పై దాడి కేసును కేంద్ర ప్రభుత్వం ఎన్ ఐఏకు అప్పగించింది. కేసును ఎన్ ఐఏకు అప్పగించడాన్ని ఏపీ సీఎం చంద్రబాబు  తప్పుబడుతున్నారు. కేంద్రంపై బాబు మండిపడుతున్నారు. ఇదే అంశంపై అమరావతిలో జనవరి 5న డీజీపీ ఠాకూర్, అడ్వకేట్ జనరల్, పోలీసు ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు.

జగన్ పై కత్తి దాడి కేసును ఎన్ ఐఏకు అప్పగించడంపై చర్చించారు. కేంద్రం నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేసే అంశంపై డిస్కషన్ చేశారు. కోర్టులో సవాలు చేయడానికి తీసుకోవాల్సిన న్యాయపరమైన అంశాలపై చంద్రబాబు చర్చోపచర్చలు చేశారు. న్యాయపరమైన అంశాలు పరిశీలిస్తూనే కేంద్ర హోంమంత్రికి  నిరసన లేఖ రాయాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేస్తామని ఇప్పటికే చంద్రబాబు ప్రకటించారు.