ఏపీ శాసనసభలో సోమవారం(జనవరి 27,2020) మండలి రద్దు తీర్మానంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడారు. ప్రజా ప్రయోజనాల కోసమే మండలి రద్దు నిర్ణయం
ఏపీ శాసనసభలో సోమవారం(జనవరి 27,2020) మండలి రద్దు తీర్మానంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడారు. ప్రజా ప్రయోజనాల కోసమే మండలి రద్దు నిర్ణయం తీసుకున్నామని సీఎం జగన్ మరోసారి స్పష్టం చేశారు.
శాసన మండలి ఎందుకు రద్దు చేస్తున్నామో సభలో వివరించారు జగన్. అసెంబ్లీ ఆమోదించిన కీలక బిల్లులను రాజకీయ కోణంలో అడ్డుకోవడానికి మాత్రమే మండలి పనిచేస్తోందని జగన్ ఆరోపించారు. మండలి మీద డబ్బు ఖర్చు చేయడం శుద్ధ దండగ అన్నారు. మండలిని కొనసాగిస్తే త్వరలో మా పార్టీకి అధిక స్థానాలు వస్తాయని అందరికి తెలుసు.. కానీ రాజకీయ కోణంలో కాకుండా ప్రజా ప్రయోజనాల కోసం మండలి రద్దు నిర్ణయం తీసుకున్నామని సీఎం జగన్ ప్రకటించారు. కీలక బిల్లులు ఆమోదం పొందకుండా రాజకీయ కోణంలో మండలిలో అడ్డుకున్నారని.. ఇలాంటి మండలి అవసరమా? అని జగన్ ప్రశ్నించారు. ప్రజలకు ఉపయోగం లేని మండలి రద్దు చేస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. సోమవారం ఉదయం నుంచి శాసనసభలో మండలి రద్దు తీర్మానంపై సుదీర్ఘ చర్చ జరిగింది.
అన్ని విషయాలు ఆలోచించాకే ఈ నిర్ణయం తీసుకున్నామని జగన్ చెప్పారు. రాజకీయ కోణంలో పని చేసే ఇటువంటి సభలు మనకు అవసరమా? అని ప్రశ్నించారు. ఎలాంటి ఉపయోగం లేని మండలికి ప్రజాధనం ఖర్చు చేయడం దండగ అన్నారు. ప్రజా ప్రయోజనాలు దెబ్బతీయడానికే మండలి ఉందన్నారు.
అసెంబ్లీ ఆమోదించిన బిల్లుల్ని అడ్డుకోవడానికే మండలి పని చేస్తోందన్నారు. దేశవ్యాప్తంగా కేవలం 6 రాష్ట్రాల్లోనే శాసన మండళ్లు ఉన్నాయని జగన్ చెప్పారు. మండలి రద్దు అధికారాన్ని రాజ్యాంగం అసెంబ్లీకే ఇచ్చిందని గుర్తు చేశారు. మండలి అవసరమే అని భావించి ఉంటే అన్ని రాష్ట్రాల్లోనూ రెండో సభను తప్పనిసరి చేసేవాళ్లని జగన్ అన్నారు. ఇది మండలి భవిష్యత్ కు సంబంధించిన అంశం కాదన్న జగన్.. ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలా.. వద్దా.. అన్నదే మన ముందున్న ప్రశ్న అన్నారు.
అసెంబ్లీలో సీఎం జగన్ కామెంట్స్:
* రాజకీయ కోణంతోనే మండలిలో బిల్లులు అడ్డుకుంటున్నారు
* ఎలాంటి ప్రజా ప్రయోజనాలు లేని మండలి అవసరమే లేదు
* ప్రజా ప్రయోజనాల కోసమే మండలి రద్దు నిర్ణయం
* మండలి అవసరమే అయితే కచ్చితంగా ఉంచేలా రాజ్యాంగంలో పెట్టేవారు
* చంద్రబాబులా నేను ఆలోచిస్తే టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా మిగలదు
* ఇది మండలి భవిష్యత్తుకు సంబంధించిన అంశం కాదు
* ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలా..వద్దా అన్నది ప్రశ్న
* మండలిపై డబ్బు ఖర్చు చేయడం దండగ
* దేశంలో 28 రాష్ట్రాల్లో కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే శాసన మండళ్లు ఉన్నాయి
* ఎస్సీ, ఎస్టీ కమిషన్.. ఇంగ్లీష్ మీడియం బిల్లులనే కాదు.. చివరికి కోట్ల మంది ప్రయోజనాల కోసం తీసుకొచ్చిన వికేంద్రీకరణ బిల్లును కూడా మండలిలో అడ్డుకున్నారు
* మంచి కోసం చేసే నిర్ణయాలు కుట్రల వల్ల ఆసల్యం కాకూడదు
* అందరికీ న్యాయం చేయాలనుకోవడం తప్పా..?
* రైతులకు గతంలో ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇవ్వడం న్యాయమా? అన్యాయమా?
* చంద్రబాబుకి ఏ విషయంలోనూ స్థిరత్వం లేదు
* అవసరమైతే పిల్లనిచ్చిన మామను పొడవడానికి కూడా వెనుకాడడు
* రాజకీయ కోణంలో మండలిలో బిల్లులను ఆలస్యం చేస్తున్నారు
* ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలనే వికేంద్రీకరణ బిల్లుని అడ్డుకున్నారు
* ప్రజలకు మంచి చేసే నిర్ణయాలు ఆలస్యం కాకూడదనే మండలి రద్దు
* అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను రాజకీయ కోణంలో అడ్డుకోవడానికి మాత్రమే మండలి పనిచేస్తోంది