తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ జిల్లాకు రానున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ శ్రేణులకు ముందస్తు సమాచారం రావడంతో ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులు కూడా బందోబస్తు చేపడుతున్నారు. రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. 2019, డిసెంబర్ 30వ తేదీ సోమవారం ఉదయం వేములవాడకు చేరుకుని రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు.
అనంతరం రోడ్డు మార్గాన..మిడ్ మానేరు ప్రాజెక్టును సందర్శిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఈ ప్రాజెక్టు అత్యంత కీలకం. ఈ ప్రాజెక్టు 25.87 టీఎంసీల సామర్థ్యం కలది. ప్రస్తుతం మిడ్ మానేరులో 24 టీఎంసీల నీరు చేరుకుంది. అనంతగిరి రిజర్వాయర్, మల్లన్న సాగర్‌కు నీటిని తరలించేందుకు ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన పనులను ఆయన పరిశీలించనున్నారు. పదో ప్యాకేజీ ద్వారా నీరు మళ్లింపు పనులు జరుగుతున్నాయి. నేరుగా కరీంనగర్‌కు చేరుకుంటారు. అక్కడ కార్యకర్తలతో సమావేశమౌతారా ? లేక తీగలగుట్టలోని టీఆర్ఎస్ భవన్‌కు చేరుకుంటారా అనేది తెలియరావాల్సి ఉంది. ఇప్పటికే పలుమార్లు మిడ్ మానేరు ప్రాజెక్టును సీఎం కేసీఆర్ సందర్శించిన సంగతి తెలిసిందే.
* తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు.
* ప్రాజెక్టు పూర్తయితే..18 లక్షల 25 వేల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందుతుందని అంచనా.
* ప్రాణహిత నది గోదావరిలో కలిసి తర్వాత..ప్రధాన నిర్మాణం సాగేలా రీ డిజైన్ చేశారు.
* శ్రీరాం సాగర్, నిజాం సాగర్, మిడ్ మానేరు, లోయర్ మానేరు, అప్పర్ మానేరు ప్రాజెక్టులను కూడా ఈ ప్రాజెక్టుతో అనుంసధిస్తున్నారు.
KCR ఉద్యమకాలం నుంచి ఏ పని మొదలు పెట్టినా..పార్టీ తరపున ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా..కరీంనగర్ నుంచే మొదలు పెట్టే వారు. జాతకాల వాస్తు, సెంటిమెంట్లంటే విపరీతమైన నమ్మకం ఉన్న విషయం తెలిసిందే. ముందస్తు ఎన్నికల్లో కూడా..కేసీఆర్ సెంటెమెంట్ ఫాలో అయ్యారు. ఒకరకంగా చెప్పాలంటే..కరీంనగర్ జిల్లా కేసీఆర్‌కు కలిసొచ్చే జిల్లా. త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో కరీంనగర్ జిల్లాకు కేసీఆర్ వస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Read More : కూలీ పనులకు వెళ్తూ మృత్యులోకాలకు : ట్రాక్టర్ చెరువులో పడి ఇద్దరు మృతి