ఆర్టీసీని ప్రక్షాళించేందుకు సీఎం కేసీఆర్ రెడీ అయిపోయారు. చెప్పినట్లుగానే ఆర్టీసీ కార్మికులతో సమావేశం కానున్నారు. ఇందుకు డేట్ ఫిక్స్ చేశారు. డిసెంబర్ 01వ తేదీన ఈ మీటింగ్ జరుగనుంది. రాష్ట్రంలో 97 డిపోలకు చెందిన కార్మికులు ఇందులో పాల్గొననున్నారు. ప్రతి డిపో నుంచి ఐదుగురు కార్మికులను ఆహ్వానించాలని ఆర్టీసీ ఎండీకు ఆదేశాలు అందాయి.
వారికి తగిన రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. సమావేశానికి పిలిచే ఐదుగురిలో ఖచ్చితంగా ఇద్దరు మహిళా ఉద్యోగులుండాలని, అన్ని వర్గాలకు చెందిన కార్మికుల భాగస్వామ్యం ఉండేలా చూడాలని సీఎం సూచించారు. మద్యాహ్నం 12 గంటల వరకు కార్మికులను ప్రగతి భవన్ తీసుకురావాలని, వారికి ప్రగతి భవన్ లోనే మద్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు.
మధ్యాహ్న భోజనం అనంతరం కార్మికులతో ముఖ్యమంత్రి నేరుగా మాట్లాడతారు. ఆర్టీసీకి సంబంధించిన అన్ని విషయాలపై చర్చించనున్నారు. రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్ తో పాటు, ఆర్టీసీ ఎండి, ఇ.డి.లు, ఆర్.ఎం.లు, డీవీఎంలను ఆహ్వానించారు.
Read More : గోడ దూకి బర్త్ డే పార్టీకి వెళ్లారు : ఇద్దరు మృతి ఏడుగురికి తీవ్రగాయాలు