Kharge vs Amit Shah: అహంకారానికి పరాకాష్ట.. అమిత్ షా వ్యాఖ్యలపై మండిపడ్డ ఖర్గే

2023లో తొమ్మిది రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు, 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికలు భారతదేశ భవిష్యత్తుకు కీలకమని కాంగ్రెస్ నేతలు నొక్కి చెప్పారు. భావజాల సారూప్యత కలిగిన పార్టీలతో కలిసి బీజేపీ నుంచి కుర్చీని తిరిగి చేజిక్కించుకోవడం ద్వారా దేశంలో కాంగ్రెస్ ప్రాధాన్యాన్ని పునర్నిర్వచించుకోవాలని నేతలు అన్నారు

Congress hits back at BJP over Amit Shah as Pinnacle of arrogance

Kharge vs Amit Shah: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి పోటీనే లేదంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. అమిత్ షా వ్యాఖ్యలు అహంకారానికి పరాకాష్ట అని ఖర్గే అన్నారు. ఇది కేవలం పార్టీ పరంగానే కాదని, దేశ ప్రజాస్వామ్యానికి పెద్ద సవాలని ఆయన అన్నారు. ఛత్తీస్‭గఢ్ రాజధాని రాయ్‭పూర్‭లో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీలో పార్టీ కోసం తీసుకోవాల్సిన తీర్మానాలపై చర్చించేందుకు జరిగిన సమావేశంలో ఖర్గే సహా కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. అయితే బీజేపీ సవాల్‌ను స్వాగతిస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు తెలపడం గమనార్హం.

VHP, Bajrang Dal: వీహెచ్‭పీ, బజరంగ్‭దళ్‭లను ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించాలంటూ ఐఎంసీ చీఫ్ డిమాండ్

ఈ సందర్భంలోనే కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ 2024లో ప్రజావ్యతిరేక బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు భావసారూప్యత గల పార్టీలతో జతకట్టేందుకు పార్టీ ఎదురుచూస్తోందని అన్నారు. “రాజ్యాంగంపై నిరంతర దాడి చేస్తున్నారు. బీజేపీ పాలన కారణంగా దేశం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందది. ప్రజాస్వామ్య విలువలు మంటగలిసి పోతున్నాయి. జాతీయ భద్రత, ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్యలు ఎగిసిపడుతున్నాయి. ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో దేశానికి సమర్థమైన, నిర్ణయాత్మకమైన నాయకత్వాన్ని అందించగల ఏకైక పార్టీ కాంగ్రెస్‌’’ అని ఖర్గే అన్నారు.

Kodali Nani : టీడీపీ పగ్గాలు జూ.ఎన్టీఆర్‌కి అప్పగించాలి, ప్రతిపక్ష హోదా అయినా దక్కుతుంది-కొడాలి నాని

2023లో తొమ్మిది రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు, 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికలు భారతదేశ భవిష్యత్తుకు కీలకమని కాంగ్రెస్ నేతలు నొక్కి చెప్పారు. భావజాల సారూప్యత కలిగిన పార్టీలతో కలిసి బీజేపీ నుంచి కుర్చీని తిరిగి చేజిక్కించుకోవడం ద్వారా దేశంలో కాంగ్రెస్ ప్రాధాన్యాన్ని పునర్నిర్వచించుకోవాలని నేతలు అన్నారు. “మన దేశ ప్రజల సంక్షేమం కోసం పాటుపడేందుకు మేము సిద్ధంగా ఉన్నాము. రాబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2024 సార్వత్రిక ఎన్నికల్లో మా లక్ష్యం కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నాం” అని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే స్పష్టం చేశారు.