Kodali Nani : టీడీపీ పగ్గాలు జూ.ఎన్టీఆర్‌కి అప్పగించాలి, ప్రతిపక్ష హోదా అయినా దక్కుతుంది-కొడాలి నాని

జూనియర్ ఎన్టీఆర్ ని టీడీపీ లోకి ఆహ్వానించడానికి లోకేష్ ఎవడు..? ఎన్టీఆర్ పార్టీలోకి ఎన్టీఆర్ ని ఆహ్వానించడం ఏంటి? చంద్రబాబు, లోకేష్ తప్పుకుని టీడీపీ ని ఎన్టీఆర్ కి అప్పగించాలి.

Kodali Nani : టీడీపీ పగ్గాలు జూ.ఎన్టీఆర్‌కి అప్పగించాలి, ప్రతిపక్ష హోదా అయినా దక్కుతుంది-కొడాలి నాని

Kodali Nani : ప్రస్తుతం ఏపీ రాజకీయాలు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చుట్టూ తిరుగుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై హాట్ హాట్ గా డిస్కషన్ నడుస్తోంది. జూ.ఎన్టీఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని టీడీపీ నేత నారా లోకేశ్ ఆకాంక్షను వ్యక్తం సంగతి తెలిసిందే. దీంతో ఒక్కసారిగా జూనియర్ ఎన్టీఆర్ పేరు హైలైట్ అయ్యింది. మరోసారి యంగ్ టైగర్ పొలిటికల్ ఎంట్రీ గురించి విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. కాగా, ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలంటూ నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు, లోకేశ్ లపై విరుచుకుపడ్డారు.

Also Read..Nara Lokesh On Jr NTR : జూ.ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై నారా లోకేశ్ హాట్ కామెంట్స్

అసలు, జూనియర్ ఎన్టీఆర్ ని టీడీపీ లోకి ఆహ్వానించడానికి లోకేష్ ఎవడు..? అని కొడాలి నాని ఫైర్ అయ్యారు. ఎన్టీఆర్ పార్టీలోకి ఎన్టీఆర్ ని ఆహ్వానించడం ఏంటని అడిగారు. చంద్రబాబు, లోకేష్ తప్పుకుని టీడీపీ పగ్గాలను వెంటనే ఎన్టీఆర్ కి అప్పగించాలని కొడాలి నాని డిమాండ్ చేశారు. మార్పు రాష్ట్రంలో కాదు టీడీపీలో రావాలన్నారు. ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణని చంద్రబాబు ఘోరంగా అవమానించ లేదా? అని కొడాలి నాని నిలదీశారు. హరికృష్ణకి పదవులు ఇవ్వకుండా దూరం చేశారని ఆరోపించారు.(Kodali Nani)

Also Read..Lakshmi Parvathy Comments Over Junior NTR : జూ.ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలి..టీడీపీని స్వాధీనం చేసుకోవాలి : లక్ష్మీ పార్వతి

”ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ని వాడుకుని వదిలేశారు. 2014లో చంద్రబాబు ప్రమాణ స్వీకారం నాడు గ్యాలరీలో కూర్చోబెట్టి అవమానించారు. ఒకే కుటుంబానికి చెందిన వాళ్లు… వీళ్లని నమ్మి ఎన్నిసార్లు మోసపోతారు. చంద్రబాబు, లోకేష్ బొమ్మతో ఓట్లు అడిగే ధైర్యం లేదు.
అందుకే జూనియర్ ఎన్టీఆర్ ని రమ్మంటున్నాడు. వార్డు మెంబర్ గా కూడా గెలవలేని లోకేశ్.. జూనియర్ ఎన్టీఆర్ ని ఆహ్వానించడం ఏంటి? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకుని ఎన్టీఆర్ ని రమ్మంటున్నాడు లోకేశ్. చంద్రబాబు నాయకత్వంలో టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాదు.
జూనియర్ ఎన్టీఆర్ వస్తే కనీసం టీడీపీకి ప్రతిపక్ష హోదా అయినా దక్కుతుంది” అని కొడాలి నాని అన్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తిరుపతి నియోజకవర్గంలో యువగళం పాదయాత్రలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు. అభివృద్ధిలో ఏపీ అగ్రస్థానంలో ఉండాలని ఎవరెవరు కోరుకుంటారో వారందరూ రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. రాజకీయాల్లో మొదట కావాల్సింది మంచి మనసు అని, 2014లోనే తాను పవన్ కల్యాణ్ లో మంచి మనసును చూశానని లోకేశ్ వెల్లడించారు. దీంతో ఒక్కసారిగా జూ.ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై చర్చ మొదలైంది.