Samapth Kumar : కాంగ్రెస్‌లో కలకలం రేపిన సంపత్ కుమార్ లేఖ

ఖమ్మం నేతలు, కొందరు ఏఐసీసీ పెద్దలు కలిసి తప్పుడు నివేదిక అందించారని ఆయన ఆరోపించారు.

Samapth Kumar : తెలంగాణ కాంగ్రెస్ లో నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ లొల్లి రాజుకుంది. నాగర్ కర్నూల్ లోక్ సభ టికెట్ ఆశిస్తున్న ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు. నాగర్ కర్నూల్ టికెట్ తనకే కేటాయించాలని లేఖ విజ్ఞప్తి చేశారు. ఖమ్మం నేతలు, కొందరు ఏఐసీసీ పెద్దలు కలిసి తప్పుడు నివేదిక అందించారని ఆయన ఆరోపించారు.

లేఖలో మాల, మాదిగ అంశాలను సైతం ప్రస్తావించారు సంపత్. మల్లు రవి నాగర్ కర్నూల్ నుంచి గతంలో నాలుగు సార్లు పోటీ చేసి ఓడిపోయారని లేఖలో ప్రస్తావించారు. అంతేకాదు మల్లు రవి వలస వచ్చిన నేత అంటూ లేఖలో పేర్కొన్నారు సంపత్ కుమార్. నాగర్ కర్నూల్ టికెట్ విషయమై.. సంపత్ కుమార్ రాసిన లేఖ కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారింది.

Also Read : ఎన్నికల వేళ కాంగ్రెస్‌లో పదవుల చిచ్చు.. సీఎం రేవంత్‌పై సీనియర్లు సీరియస్