Congress President Election-2022: ఖర్గే ఇంటికి దిగ్విజయ్ సింగ్.. స్పందించిన శశి థరూర్

దిగ్విజయ్ సింగ్ పోటీలో నిలుస్తున్న విషయం గురించి శశి థరూర్ స్పందిస్తూ... ‘‘మా అందరిదీ ఒకటే సిద్ధాంతం. పార్టీని బలపర్చాలని అనుకుంటున్నాం. మా మధ్య స్నేహపూర్వక పోటీ ఉంది. శత్రుత్వం లేదు. మల్లికార్జున ఖర్గే కూడా పోటీ చేయనున్నారంటూ ఊహాగానాలు మాత్రమే వస్తున్నాయి. ఆయన కూడా మా గౌరవప్రదమైన సహచర నేత. లోక్ సభలో మేము కలిసి పనిచేశాం. పోటీలో ఎక్కువ మంది ఉండడం మంచిదే’’ అని అన్నారు.

Congress President Election-2022: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ డ్రామా కొనసాగుతోంది. నేడు నామినేషన్లకు చివరి గడువన్న విషయం తెలిసిందే. అయితే, ఎన్నికల రేసులో ఉన్న నేతల జాబితాలో అనూహ్యంగా కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే పేరు రావడంతో ఆయన ఇంటికి దిగ్విజయ్ సింగ్ వెళ్లారు. దిగ్విజయ్‌ సింగ్‌ కూడా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న విషయం తెలిసిందే. ఖర్గేతో భేటీ నేపథ్యంలో దిగ్విజయ్‌ పోటీ నుంచి తప్పుకుంటారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

గాంధీ కుటుంబం మద్దతు ఖర్గేకే ఉంది. మరోవైపు, నామినేషన్ వేయడానికి కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ బయలుదేరారు. ఈ ఎన్నికలో పోటీ ఖర్గే-శశిథరూర్‌ మధ్యే ఉండనుంది. ఇవాళ శశి థరూర్ నామినేషన్ వేయడానికి బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడారు. ‘‘నేను నామినేషన్ వేయడానికి వెళ్తున్నాను. నన్ను మీరు అక్బర్ రోడ్ 24 వద్ద చూడొచ్చు’’ అని అన్నారు.

దిగ్విజయ్ సింగ్ పోటీలో నిలుస్తున్న విషయం గురించి శశి థరూర్ స్పందిస్తూ… ‘‘మా అందరిదీ ఒకటే సిద్ధాంతం. పార్టీని బలపర్చాలని అనుకుంటున్నాం. మా మధ్య స్నేహపూర్వక పోటీ ఉంది. శత్రుత్వం లేదు. మల్లికార్జున ఖర్గే కూడా పోటీ చేయనున్నారంటూ ఊహాగానాలు మాత్రమే వస్తున్నాయి. ఆయన కూడా మా గౌరవప్రదమైన సహచర నేత. లోక్ సభలో మేము కలిసి పనిచేశాం. పోటీలో ఎక్కువ మంది ఉండడం మంచిదే’’ అని శశి థరూర్ అన్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

ట్రెండింగ్ వార్తలు