Congress presidential polls: సోనియా గాంధీ నాకు మద్దతు తెలుపుతున్నారని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారు: ఖర్గే

‘‘కాంగ్రెస్ అధ్యక్షుడిగా నా పేరును సోనియా గాంధీ సూచించారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఇప్పటికే సోనియా గాంధీ ఓ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నికలో గాంధీ కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేయబోరని, అలాగే, ఎవరికీ తాము మద్దతు తెలపబోమని అన్నారు’’ అని మల్లికార్జున ఖర్గే తెలిపారు. సోనియా గాంధీ తనకు మద్దతు తెలుపుతున్నారని కొందరు అసత్య ప్రచారం చేస్తూ కాంగ్రెస్ కి, సోనియా గాంధీకి, తనకు చెడ్డ పేరు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు.

Congress presidential polls: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు ఈ నెల 17న జరగనున్న నేపథ్యంలో సీనియర్ నేత మల్లికార్జున ఖర్గేకు ఆ పార్టీ ప్రస్తుత అధినేత్రి సోనియా గాంధీ మద్దతు ఇస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ ప్రచారంలో వాస్తవం లేదని మల్లికార్జున ఖర్గే చెప్పుకొచ్చారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… సోనియా గాంధీ తనకు మద్దతు తెలపలేదని అన్నారు.

‘‘కాంగ్రెస్ అధ్యక్షుడిగా నా పేరును సోనియా గాంధీ సూచించారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఇప్పటికే సోనియా గాంధీ ఓ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నికలో గాంధీ కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేయబోరని, అలాగే, ఎవరికీ తాము మద్దతు తెలపబోమని అన్నారు’’ అని మల్లికార్జున ఖర్గే తెలిపారు.

సోనియా గాంధీ తనకు మద్దతు తెలుపుతున్నారని కొందరు అసత్య ప్రచారం చేస్తూ కాంగ్రెస్ కి, సోనియా గాంధీకి, తనకు చెడ్డ పేరు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు ఎవరికి ఓటు వేస్తారో వారే పార్టీ అధ్యక్షుడవుతారని అన్నారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులను చూసే తాను ఈ పోటీలో నిలిచానని, మోదీ-షాల తీరు వల్ల దేశానికి ఎంతో నష్టం జరుగుతోందని చెప్పుకొచ్చారు. కాగా, ఈ నెల 17న ఎన్నికలు జరిగాక, అదే రోజు ఫ‌లితాలు వెల్లడిస్తారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

ట్రెండింగ్ వార్తలు