Mann Ki Baat: ‘మణిపూర్ కీ బాత్’ ఏది? మోదీ మన్ కీ బాత్‭పై కాంగ్రెస్ విమర్శలు

మణిపూర్ రాష్ట్రం అసలు ఈ దేశంలో భాగం కాదన్నట్లుగానే చూస్తున్నారని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శలు గుప్పించారు. ఇప్పటి వరకు ఒక్క మీటింగ్ కూడా ఏర్పాటు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

Manipur Violence: మణిపూర్ రాష్ట్రంలో నెల రోజులకు పైగా పెద్ద అల్లర్లు చెలరేగుతున్నాయి. కేంద్ర బలగాలను మోహరించినప్పటికీ పరిస్థితులు ఏమాత్రం చక్కబడటం లేదు. రాష్ట్రంలో మైతీ, కుకి వర్గాలకు మధ్య ఏర్పడిన ఘర్షణ రోజు రోజుకు పెరుగుతుందే కానీ, ఏమాత్రం అదుపులోకి రావడం లేదు. అయితే ప్రతి నెల ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమం సందర్భంగా జూన్ మన్ కీ బాత్ ఈరోజు (జూన్18) నిర్వహించారు. అయితే మన్ కీ బాత్ ప్రసంగంలో మణిపూర్ ప్రస్తావన రాలేదు. దీంతో ప్రధాని మోదీ లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ విమర్శలు ఎక్కుపెట్టింది.

Narendra Modi: మోదీకి ప్రైవేట్ డిన్నర్ కూడా ఇవ్వనున్న జో బైడెన్!

మోదీ వ్యవహారశైలి చూస్తుంటే మణిపూర్ రాష్ట్రం అసలు ఈ దేశంలో భాగం కాదన్నట్లుగానే చూస్తున్నారని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శలు గుప్పించారు. ఇప్పటి వరకు ఒక్క మీటింగ్ కూడా ఏర్పాటు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

Mann Ki Baat: ఒక వారం ముందుగానే మోదీ ‘మన్ కీ బాత్’.. ముందుగా ఎందుకు పెట్టారంటే?

ప్రధాని మన్ కీ బాత్ ప్రసంగం ముగిసిన కాసేపటికే ఖర్గే ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ‘‘నరేంద్రమోదీజీ.. మీ మన్ కీ బాత్‭లో మణిపూర్ కీ బాత్ ఉండాలి. కానీ లేదు. దేశ సరిహద్దులో ఉన్న రాష్ట్రం చాలా సమస్యల మధ్య కొట్టుమిట్టాడుతోంది. కానీ మీరు దీనిపై ఒక్క మాట మాట్లాడడం లేదు. దీనిపై మీరు ఒక్క సమావేశం అయినా పెట్టలేదు. ఒక్క అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయలేదు. మీ ప్రభుత్వ తీరు చూస్తుంటే మణిపూర్ మన దేశంలోనే లేనట్లు చూస్తున్నారు. ఇది ఆమోదయోగ్యం కాదు. ఆ రాష్ట్రం తగలబడిపోతుంటే మీ ప్రభుత్వం నిద్రపోతుంది. ఇది రాజధర్మం కాదు’’ అని అన్నారు.

Indian Student : యూకేలో దారుణం.. రూమ్‌కి మోసుకెళ్లి మరీ యువతిపై భారతీయ విద్యార్థి అత్యాచారం, షాకింగ్ వీడియో

శాంతికి భంగం కలిగించే అన్ని అంశాల పట్ల దృఢంగా వ్యవహరించాలని, పౌర సమూహాలను విశ్వాసంలోకి తీసుకోవడం ద్వారా సాధారణ స్థితిని పునరుద్ధరించాలని ఖర్గే డిమాండ్ చేశారు. అలాగే వెంటనే అఖిలపక్ష సమావేశం పెట్టి రాష్ట్రాన్ని సందర్శించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీని మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు.