Congress stings Assam CM over Shah Rukh's phone call
Shahrukh and Sharma: షారూఖ్ ఖాన్ ఎవరో తనకు తెలియదంటూ శుక్రవారం వ్యాఖ్యానించిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ.. ఆదివారం యూటర్న్ తీసుకున్నారు. షారూఖ్ తనకు ఫోన్ చేశాడని, తనతో మాట్లాడడని ఆయన చెప్పడంతో రాజకీయ దుమారం లేచింది. ఇప్పటిక షారూఖ్ నటించిన ‘పఠాన్’ సినిమా వివాదం రాజకీయ కుదిపివేస్తుంది. అయితే ఈ వివాదంలో కాంగ్రెస్ అంతగా తలదూర్చలేకపోయింది. కానీ తాజాగా అస్సాం సీఎం ట్వీట్‌తో హస్తం పార్టీకి ఉప్పు దొరికినట్లైంది. అంతే, బీజేపీకి రాజకీయం, పాలన తెలియడం లేదని, ప్రభుత్వాన్ని నడపడానికి సంఘీలుగా (ఆర్ఎస్ఎస్) మారిన వారు, ఇకపై కాంగ్రెస్ వ్యక్తులుగా మారాల్సి ఉంటుందంటూ కాంగ్రెస్ పార్టీ మీడియా, ప్రచార విభాగం చీఫ్ పవన్ ఖేడా అన్నారు.
Guruvayur Temple: రూ.1,700 కోట్లు, 260 కేజీల బంగారం, 271 ఎకరాలు.. గురువాయూర్ గుడి ఆస్తులివి
భజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ సంఘాలకు చెందిన కొంత మంది గుహవాటిలో ఓ సినిమా థియేటర్లో ‘పఠాన్’ సినిమా పోస్టర్లను చించేశారు. అలాగే ఆ సినిమాను అడ్డుకుంటామని ప్రకటించారు. థియేటర్లో హంగామా సృష్టించారు. దీంతో అస్సాం ముఖ్యమంత్రికి షారూఖ్ ఖాన్ ఫోన్ చేసి రక్షణ కోరారు. దీంతో ‘పఠాన్’ సినిమా ప్రదర్శన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తమ ప్రభుత్వం చూస్తుందని షారూఖ్‌కి అస్సాం సీఎం హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా బయటికి వెల్లడించారు. దీనికి ఒకరోజు ముందు ఈ థియేటర్ విధ్వంసం గురించి శర్మను ప్రశ్నించగా.. తనకు పఠాన్ సినిమా గురించి తెలియదని, అసలు షారూఖ్ అనే వ్యక్తి ఎవరో తెలియదని అన్నారు.
Karnataka: అరటిపళ్లు, చిక్కీ కాదు గుడ్లు కావాలి.. 80% స్కూలు పిల్లల అభిప్రాయమిది
ఇక దీనిపై కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ ‘‘ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సంఘీలుగా మారిన వ్యక్తులు.. ఇప్పుడు అదే రాజధర్మంపై ప్రభుత్వాన్ని నడపడానికి కాంగ్రెస్‌వాళ్ళుగా మారాలి” అంటూ స్పందించారు. వాస్తవానికి ఈ వ్యాఖ్యలు హిమంత బిశ్వా శర్మను ఉద్దేశించి అన్నవే. ఎందుకంటే గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉండేవారు. అయితే అస్సాం అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే రాబోయే రోజుల్లో అస్సాంలో కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందని, మరోసారి ప్రభుత్వాధినేత కావాలంటే హిమంత శర్వ కాంగ్రెస్ పార్టీలోకి రావాలని పరోక్షంగా చెప్పారు.