అనంతలో పాతకక్షలు : వైసీపీ నేత అంబులెన్స్‌ని తగులబెట్టారు

  • Publish Date - April 14, 2019 / 03:57 AM IST

ఏపీలో ఎన్నికలు అయిపోయాయి. ఇక ఫలితాలే మిగిలి ఉన్నాయి. ఎన్నికల సందర్భంలో జరిగిన గొడవలు ఇంకా సద్దుమణగలేదు. అక్కడకక్కడ ఘర్షణలు, దాడులు జరుగుతూనే ఉన్నాయి. టీడీపీ – వైసీపీ పార్టీలకు చెందిన నేతలు ఘర్షణ పడుతుండడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంటోంది. ధర్మవరంలో మరో ఘటన చోటు చేసుకుంది. వ్యక్తులపై దాడులు జరగలేదు. ఓ వాహనాన్ని దగ్ధం చేశారు దుండగులు.

మద్దిగుబ్బ మండల కేంద్రంలో వైసీపీ నేత ప్రతాప్ రెడ్డికి ఓ అంబులెన్స్ ఉంది. దీనిని ప్రజాసేవకు వినియోగిస్తున్నారు. ఏప్రిల్ 13వ తేదీ అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అంబులెన్స్‌కి నిప్పంటించారు. వాహనం పూర్తిగా కాలిపోయింది. ఎన్నికల నేపథ్యం..పాతకక్షలే కారణమని తెలుస్తోంది. ప్రజాసేవకు ఉపయోగిస్తున్న అంబులెన్స్ తగులపెట్టడం కరెక్టు కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎవరూ కంప్లయింట్ చేయకపోవడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టడం లేదని తెలుస్తోంది.