ఎన్నికలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. అధికారంలోకి వచ్చేందుకు పార్టీలు ప్లాన్స్ రచిస్తున్నాయి. ఈ టైంలో అధికారపక్షమైన టీడీపీకి చెందిన అనంతపురం జిల్లా ధర్మవరం సిట్టింగ్ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యానారాయణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఆయన మాట్లాడిన ఆడియో టేపులు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. కార్యకర్తల మీటింగ్‌లో చేసిన వ్యాఖ్యలు ఎలా లీక్ అయ్యాయో తెలియరావడం లేదు. ఆడియో టేపులు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.
‘మళ్లీ బాబు ముఖ్యమంత్రి అయితే టీడీపీకి తిరుగుండదు..కౌంటింగ్ పూర్తయిన తరువాత రాజకీయ ప్రత్యర్థులపై దాడులు చేద్దాం..నరుకుదాం, చంపుదాం..ఎలాంటి చర్యలు తీసుకోకుండా పోలీసులకు ముందే చెబుదాం..6 మాసాల్లోగా ప్రత్యర్థులను అంతమొందిద్దాం’ అంటూ సూర్యానారాయణ చెప్పిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కార్యకర్తలతో మాట్లాడుతున్న టేపులు విడుదలయ్యాయి. అయితే..ఆయన ఎక్కడ మాట్లాడారు ? ఎప్పుడు మాట్లాడారు ? వివిధ వివరాలు తెలియాల్సి ఉంది. ఈ టేపులపై సూర్యనారాయణ ఎలా రెస్పాన్ అవుతారో చూడాలి.