Asaduddin Owaisi vs Sachin Pilot: మోదీ ఆశిస్సులతో దాక్కోలేదు.. సచిన్ పైలట్ వ్యాఖ్యలపై ఓవైసీ ఘాటు విమర్శ

దౌసాకి (రాజస్థాన్) ప్రధానమంత్రి నరేంద్రమోదీ వెళ్లారు. టోంక్‭కి (రాజస్థాన్) ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ వెళ్లారు. ఎందుకంటే ఇది ఎన్నికల సంవత్సరం. నాలుగేళ్ల నుంచి ఈ నాయకులు ఎందుకు రాజస్థాన్‭కు రాలేదు? ఎన్నికలు రాగానే వారిద్దరు వరుస పర్యటనలు చేస్తూ ఉపన్యాసాలు ఇస్తున్నారు. మతం గురించి మాట్లాడుతున్నారు. వారు కనిపించేది ఈ ఎన్నికల టైంలో మాత్రమే

Asaduddin Owaisi vs Sachin Pilot: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కనిపించకుండా పోతారంటూ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ చేసిన వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఓవైసీ ఘాటుగా స్పందించారు. ముఖ్యమంత్రి కుర్చీ కోసం మోదీ మద్దతుతో హర్యానా వెళ్లి దాక్కోలేదంటూ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మీద సచిన్ పైలట్ చేసిన తిరుగుబాటును ఉదహరిస్తూ చురకలు అంటించారు. తాను రాజస్థాన్ వస్తూనే ఉంటానని, జునైద్-నసీర్ హత్యలు ఎన్నికల అంశం కాదని ఓవైసీ అన్నారు.

Supreme Court: ఎన్నికల సంఘం ఇచ్చిన నోటిఫికేషన్ పై ఏక్ నాథ్ షిండే వర్గానికి సుప్రీంకోర్టు నోటీసులు

దీనికి రెండు రోజుల ముందు సచిన్ పైలట్ స్పందిస్తూ ‘‘ఫిబ్రవరి చాలా ప్రత్యేకమైంది. దౌసాకి (రాజస్థాన్) ప్రధానమంత్రి నరేంద్రమోదీ వెళ్లారు. టోంక్‭కి (రాజస్థాన్) ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ వెళ్లారు. ఎందుకంటే ఇది ఎన్నికల సంవత్సరం. నాలుగేళ్ల నుంచి ఈ నాయకులు ఎందుకు రాజస్థాన్‭కు రాలేదు? ఎన్నికలు రాగానే వారిద్దరు వరుస పర్యటనలు చేస్తూ ఉపన్యాసాలు ఇస్తున్నారు. మతం గురించి మాట్లాడుతున్నారు. వారు కనిపించేది ఈ ఎన్నికల టైంలో మాత్రమే. ఈ ఎన్నికల్లో రాజస్థాన్ ప్రజలు వారిని మొత్తమే కనిపించకుండా చేస్తారు’’ అని అన్నారు.

Sadhvi Prachi: స్వర భాస్కర్ వివాహంపై వీహెచ్‭పీ నేత సాధ్వి ప్రాచి సంచలన వ్యాఖ్యలు

కాగా, పైలట్ వ్యాఖ్యలపై ఓవైసీ స్పందిస్తూ ‘‘పైలట్ సాహెబ్.. మేము ఎల్లప్పుడూ బీజేపీని వ్యతిరేకిస్తూనే ఉన్నాము. పార్లమెంటులో మోదీ ప్రభుత్వం చేసే చట్టాలను సమర్ధించే కాంగ్రెస్ పార్టీలా మేము కాదు. కేవలం ముఖ్యమంత్రి కుర్చీ కోసం మోదీ ఆశిస్సులతో హర్యానా వెళ్లి దాక్కోలేదు. నాకు యూ-టర్న్‭లు అస్సలు అలవాటు లేదు. చింతించకండి, నేను రాజస్థాన్ వస్తూనే ఉంటాను. జునైద్-నసీర్ హత్యలు ఎన్నికల అంశం కాదు. న్యాయానికి సంబంధించిన ప్రశ్న’’ అని అన్నారు.

Sharad Pawar: మొన్న అలా, ఈరోజు ఇలా.. శివసేన విషయంలో ఈ నిర్ణయంపై శరద్ పవార్ డబుల్ కామెంట్స్

ఇక జునైద్-నసీర్ హంతకులకు మద్దతుగా రాజస్థాన్ రాష్ట్రంలో మహాపంచాయత్‭లు తీర్మానాలు చేయడాన్ని ఓవైసీ గుర్తు చేశారు. బాధితులకు కాంగ్రెస్ ఏం చేయలేకపోయిందని, హంతకులకు స్వేచ్ఛనిచ్చిందని విమర్శించారు. ‘‘జునైద్-నసీర్ హంతకులకు మద్దతుగా మహాపంచాయత్‌లను మనం చూశాం, కానీ హత్యను ఖండించడం లేదా నిరసించడం ఒక చిన్న సభ కూడా లేదు. ఏ సంఘం పేరుతో గోవుల భీభత్సం జరుగుతోందో, ఆ సమాజ ఉగ్రవాదాన్ని ఖండించలేమా?’’ అని ఓవైసీ ప్రశ్నించారు.

ట్రెండింగ్ వార్తలు