Shah criticize Rahul: మోదీకి 20 సార్లు ఫెయిల్ అయిన రాహుల్ గాంధీ పోటీయేంటి? అమిత్ షా సెటైర్లు

ఈ నెల 23న బిహార్ రాజధాని పాట్నాలో విపక్షాల మహా సమావేశం జరిగింది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా దేశంలోని 15 విపక్ష పార్టీలు ఈ సమావేశంలో పాల్గొన్నాయి. ఒక ఆమ్ ఆద్మీ పార్టీ మినహా.. మిగిలిన అన్ని పార్టీలు కాంగ్రెస్ వెంట నడుస్తామని తేల్చి చెప్పాయి

Bihar: ప్రధానమంత్రి నరేంద్రమోదీకి రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీ పోటీగా నిలుస్తారంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సెటైర్లు గుప్పించారు. 20 ఫెయిల్ అయిన రాహుల్ గాంధీ.. ప్రధాని మోదీకి పోటీ ఏంటంటూ ఆయన ఎద్దేవా చేశారు. బిహార్‭లో జరిగిన ర్యాలీలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూన్ 23న జరిగిన విపక్షాల సమావేశంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

DMK Minister Senthil Balaji : తమిళనాడు గవర్నర్ అర్ధరాత్రి సంచలన నిర్ణయం..మంత్రి డిస్మిస్ ఉత్తర్వు వెనక్కి

‘‘వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రజల ఎంపికలో ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ ఉన్నారనటి అంటున్నారు. 2024 ఎన్నికల్లో నరేంద్ర మోదీ, రాహుల్ మధ్య పోటీ ఉంటుందని అంటున్నారు. రాహుల్ గాంధీని నాయకుడిగా మార్చడానికి కాంగ్రెస్ 20 సార్లు ప్రయోగించి ఘోరంగా విఫలమైంది. అలాంటి వ్యక్తి మోదీకి పోటీ ఏంటి?’’ అని అమిత్ షా ప్రశ్నించారు. బిహార్ రాష్ట్రంలో బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ జేడీయూ-ఆర్జేడీ కూటమిలో భాగస్వామిగా ఉంది.

MLA Shakeel : దమ్ముంటే ముందు నుండి కొట్లాడండి వెనక నుండి కాదు.. అసదుద్దీన్ కి ఎమ్మెల్యే షకీల్ సవాల్

ఇకపోతే.. ఈ నెల 23న బిహార్ రాజధాని పాట్నాలో విపక్షాల మహా సమావేశం జరిగింది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా దేశంలోని 15 విపక్ష పార్టీలు ఈ సమావేశంలో పాల్గొన్నాయి. ఒక ఆమ్ ఆద్మీ పార్టీ మినహా.. మిగిలిన అన్ని పార్టీలు కాంగ్రెస్ వెంట నడుస్తామని తేల్చి చెప్పాయి. అయితే ఆ సమావేశం అనంతరమే వచ్చే నెల జూలైలో మరో సమావేశం ఉంటుందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే పాట్నా సమావేశం అనంతరం ప్రకటించారు.

Tamil Nadu Politics: అవును, మాది కుటుంబ పార్టీనే.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీఎం స్టాలిన్

వాస్తవానికి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 10-12 తేదీల మధ్య జరిగే అవకాశం ఉందని వార్తలు అవచ్చాయి. అయితే ఆ సమావేశం నుంచి హిమాచల్ ప్రదేశ్ నుంచి కర్ణాటకకు మారింది. జూలై 13 లేదంటే 14వ తేదీన బెంగళూరలో జరుగుతుందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ గురువారం ప్రకటించారు. ఇక ఈ విపక్షాల కూటమికి పేట్రియాటిక్ డెమొక్రటిక్ అలయన్స్ (పీడీఏ) అని పేరు పెట్టనున్నట్లు సమాచారం.

ట్రెండింగ్ వార్తలు