Congress President Poll: మల్లికార్జున ఖర్గే గెలిస్తే అంటూ స్పందించిన శశి థరూర్

అధ్యక్ష ఎన్నికల గెలుపోటములపై శశి థరూర్ స్పందించారు. శనివారం అస్సాంలోని గువహాటిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘ఖర్గే సాబ్ గెలిచినా, నేను గెలిచినా చివరికి అది పార్టీ గెలుపే’’ అని అన్నారు. వాస్తవానికి తన గెలుపుపై ముందున్నంత నమ్మకంతో, ఉత్సాహంతో శశి థరూర్ ఇప్పుడు కనిపించడం లేదు. కొద్ది రోజులుగా తనకు పార్టీ నుంచి ఆదరణ లభించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు

Congress President Poll: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు తుది దశకు వస్తున్నాయి. పరిస్థితులు చూస్తుంటే మల్లికార్జున ఖర్గేనే అధ్యక్షుడిగా గెలవొచ్చనే విశ్లేషణలు పెరిగాయి. కారణం, ఆయన వెనుక గాంధీ కుటుంబం మద్దతు ఉందనే విషయం తెలిసిందే. అంతే కాకుండా పార్టీ నేతలు అనేక మంది ఇప్పటికే ఖర్గేకు బహిరంగ మద్దతు ప్రకటించారు. శశి థరూర్ మీడియా డిబేట్లలో పాల్గొంటున్నారే కానీ, పార్టీ నుంచి అంతగా స్పందన రావడం లేదు.

ఈ తరుణంలో అధ్యక్ష ఎన్నికల గెలుపోటములపై శశి థరూర్ స్పందించారు. శనివారం అస్సాంలోని గువహాటిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘ఖర్గే సాబ్ గెలిచినా, నేను గెలిచినా చివరికి అది పార్టీ గెలుపే’’ అని అన్నారు. వాస్తవానికి తన గెలుపుపై ముందున్నంత నమ్మకంతో, ఉత్సాహంతో శశి థరూర్ ఇప్పుడు కనిపించడం లేదు. కొద్ది రోజులుగా తనకు పార్టీ నుంచి ఆదరణ లభించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆ మధ్య ఏకంగా గాంధీ కుటుంబంపైనే పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

ఇక తాజాగా గువహాటిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ఖర్గే సాబ్ గెలిచినా నేను గెలిచినా తేడా ఏమీ ఉండదు. ఇద్దరిలో ఎవరు గెలిచినా అది పార్టీ గెలుపే. కాంగ్రెస్ గెలుపే. దేశాన్ని సమ్మిళితం చేయడానికే ఆ గెలుపు. దేశంలోని ప్రజలందరినీ కుల, మత, లింగ, ప్రాంతీయ, భాషా బేధాలు లేకుండా ఏకత్వంతో చూసే పార్టీ కాంగ్రెస్ మాత్రమే. భారతీయలుగా గుర్తించబడ్డారంటే వారంతా మనవారే అని కాంగ్రెస్ భావిస్తుంది. మిగతా పార్టీలలాగ ఇది హిందూ దేశం, మరేదో దేశం అని మేం చెప్పము. ఇది భారతీయులందరి దేశం. మేం అందరి కోసం పని చేస్తాం’’ అని అన్నారు.

APJ Abdul Kalam: ఆ హెచ్చరికలతోనే 2014లో ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి డుమ్మా కొట్టిన మాజీ రాష్ట్రపతి కలాం

ట్రెండింగ్ వార్తలు