కరీంనగర్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గుండెపోటుతో మృతి చెందిన డ్రైవర్ నగునూరి బాబు అంతిమయాత్ర బస్ డిపోకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన ఆర్టీసీ నేతలను, కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. తాము మాత్రం డెడ్ బాడీని డిపోకు తీసుకెళుతామని..తమను అడ్డుకోవద్దని వారు డిమాండ్ చేశారు. పోలీసులు నో చెప్పడంతో…వారి వాహనానికి ఎదురుగా టైర్లు..కట్టెలు వేసి నిప్పు పెట్టారు.
వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలకు పని చెప్పారు. కొంతమంది కార్మికులు సొమ్మసిల్లి పడిపోయారు. దీనిపై కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరికొంతమందికి గాయాలయ్యాయని తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ డిపో వద్దకు మృతదేహంతో ర్యాలీగా వెళుతామని ఎంపీ బండి సంజయ్ ప్రకటించారు. చివరకు పోలీసులు నేతలు, వివిధ పార్టీల నేతలతో చర్చలు జరిపారు. బాబు నివాసం పక్కనే ఉన్న మార్గం గుండా శ్మశానవాటికకు తీసుకెళ్లాలని సూచించారు. బస్ డిపోకు తీసుకెళితే..శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు.
ఇటీవలే సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఆర్టీసీ జేఏసీ నిర్వహించిన సకల జనభేరి సభలో బాబు పాల్గొని గుండెపోటుకు గురయ్యాడు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రభుత్వం..ఆర్టీసీ జేఏసీ నేతలతో చర్చలు జరిపేదాక అంత్యక్రియలు నిర్వహించబోమని ఆర్టీసీ జేఏసీ నేతలు, కుటుంబసభ్యులు రాజకీయ నేతలు స్పష్టం చేశారు. రెండు రోజుల పాటు బంద్‌కు పిలుపునిచ్చారు. ఎలాంటి సంఘటనలు జరగుకుండా ఉండేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Read More : కరీంనగర్‌లో టెన్షన్ : డ్రైవర్ బాబు అంత్యక్రియలపై ఆర్టీసీ జేఏసీ ప్రకటన