Etela Rajender
Etela Rajender : రేపటి(జూన్ 18,2021) నుండి ఇంటి ఇంటి ప్రచారం చేస్తానని మాజీ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. హుజూరాబాద్ చైతన్య వంతమైన నియోజకవర్గం అని, ఆరు సార్లు ఎన్నికలు వస్తే అన్ని సార్లు తనను గెలిపించారని ఈటల అన్నారు. ప్రతి గ్రామంలో తనకు ఆశీర్వాదాలు అందాయన్నారు. కేసీఆర్ నీకు అన్యాయం చేశాడని అంటున్నారని చెప్పారు. చైతన్యవంతమైన హుజూరాబాద్ ప్రజలు కేసీఆర్ కు బుద్ధి చెబుతామన్నారని ఈటల తెలిపారు.
మా ప్రజలు ప్రేమకు లొంగుతారు ప్రగల్బాలకు కాదని ఈటల అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఏది చెప్పినా ప్రజలు నమ్మరని ఈటల అన్నారు. ప్రగతి భవన్ లో రాసిస్తే చదివే మంత్రులు.. కుటుంబాల్లో ఎంత బాధపడుతున్నారో తెలుసుకోవాలన్నారు. రాచరికానికి తెరదించేందుక హుజూరాబాద్ ప్రజలు ఎదురు చూస్తున్నారని ఈటల అన్నారు. తనకు మద్దతిస్తున్న వారిని ఇంటిలిజెన్స్ అధికారులు వేధిస్తున్నారని ఈటల ఆరోపించారు. చిలుక పలుకులు పలుకుతున్న మంత్రులకు ఆత్మగౌరవమా ఉందా అని ప్రశ్నించారు. ఆత్మగౌరవం పోరాటానికి హుజూరాబాద్ వేదిక కానుందన్నారు ఈటల.