FASTag : టోల్ ప్లాజాల వద్ద ఇబ్బందులు

  • Publish Date - December 16, 2019 / 05:38 AM IST

జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద FASTag విధానం 2019, డిసెంబర్ 16వ తేదీ ఆదివారం నుంచి అమల్లోకి వచ్చింది. వాహనదారులు రెండో రోజు కూడా ఇబ్బందులు పడుతున్నారు. టోల్‌గేట్ల వద్ద వాహనాలు బారులు తీరే సమస్యను నివారించడంతోపాటు ఖర్చు తగ్గించుకునే ఉద్దేశంతో కేంద్రం ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. కానీ..ఈ నూతన విధానానికి ఇంకా సిద్ధం కాకపోవడంతో ఇబ్బందుల పాలవుతున్నారు.

పాస్టాగ్‌లేని వాహనదారులు టోల్‌ను నగదు రూపంలో చెల్లించేందుకు బారులు తీరుతున్నారు. ఫాస్టాగ్ ఉన్న వాహనదారుల కోసం టోల్‌గేట్ల వద్ద ఎక్కువ సంఖ్యలో లైన్లను కేటాయించారు. ఈ సౌకర్యం లేని వారు నగదు చెల్లించేందుకు ఒకేఒక్క లైన్‌ కేటాయించడంతో మొదటిరోజు టోల్ గేట్ల వద్ద భారీ రద్దీ ఏర్పడింది. మెజార్టీ సంఖ్యలో వాహనదారులు ఫాస్టాగ్ తీసుకోకపోవడంతో ఈ రద్దీ ఏర్పడింది. ఫాస్టాగ్ కోసం కేటాయించిన లైన్లనో వెహికల్స్ రయ్యి మంటూ దూసుకెతుంటే..నగదు చెల్లించే లైన్లలో మాత్రం వాహనాలు పెద్ద ఎత్తున బారులు తీరుతున్నాయి.

మరోవైపు… కొన్నిచోట్ల ట్యాగ్‌ రీడర్లు పనిచేయకపోవటంతో గందరగోళం ఏర్పడింది. సాంకేతిక వ్యవస్థ సరిగా లేకపోవటంతో ఫాస్టాగ్‌ అంటించిన వాహనాలు కూడా లేన్లలో నిలిచిపోవాల్సి వచ్చింది. టోల్‌ ప్లాజాల సిబ్బంది హ్యాండ్‌ మెషీన్లతో ట్యాగ్‌లను రీడ్‌ చేయాల్సి వస్తోంది. దీంతో వాహనదారులు కొంత అసహనానికి గురయ్యారు. అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
ఫాస్టాగ్ రీఛార్జ్‌లోను ఇబ్బందులున్నాయని కొందరు వాహనదారులు అంటున్నారు.

చెల్లించిన సొమ్మంతా రీఛార్జ్ కావడంలేదని దీంతో తమ డబ్బు వృధా అవుతోందని  ఆరోపిస్తున్నారు. మరికొన్నిFASTagచోట్ల… వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో 4 లైన్లు కూడా చాలడం లేదు. ఇటు… క్యాష్‌ లైన్‌ ఒకటే ఉండటం..ఫాస్టాగ్‌ లైన్‌లోకి వెళితే డబుల్‌ చార్జీ వసూలు చేస్తారన్న భయంతో.. క్యాష్‌ లైన్ మీద ఒత్తిడి పడుతోంది. అధికారులు మాత్రం సమస్యలు ఉండబోవంటున్నారు. వాహనదారులందరూ వీలైనంత త్వరగా ఫాస్టాగ్ విధానంలోకి మారాలని సూచిస్తున్నారు.
Read More : హైదరాబాద్‌ను తాకిన పౌరసత్వ నిరసనలు : MANNU విద్యార్థుల ఆందోళన