పోల్ సైరన్ మోగింది. ఏప్రిల్ 11 న ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ జరుగనుండగా , మే 23 న ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఒకసారి ఏపీ రాష్ట్రాన్ని పరిశీలిస్తే…ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 25 లోక్ సభ సీట్లున్నాయి. ఇక్కడ ప్రధాన పార్టీలుగా టీడీపీ, వైసీపీలున్నాయి. గతంలో కొద్ది ఓట్ల తేడాతో వైసీపీ అధికారంలోకి రాలేకపోయింది. ఈసారి మాత్రం ఎలాగైనా సీఎం కుర్చీపై కూర్చొవాలని జగన్ తాపత్రయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీ స్థాపించి ఎన్నికల బరిలో నిలవబోతున్నారు. ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన సమస్యలు ,అమరావతి రాజధాని నిర్మాణం వంటివి ఈ ఎన్నికల్లో ప్రధాన అంశాలు గా ఉండబోతున్నాయి. అధికార టీడీపీ ఇప్పటికే 115 మంది అసెంబ్లీ అభ్యర్ధుల జాబితా సిధ్దం చేసింది. సీఎం చంద్రబాబు తిరుపతి నుంచి తన ఎన్నికల ప్రచార సభను ప్రారంభిచబోతున్నారు. ఏపీ లో ఓటర్ల వివరాలు పరిశీలిస్తే ….
మొత్తం ఓటర్లు: 3,69,33,091.
పురుషులు: 1,83,24,588.
మహిళలు: 1,86,04,742.
థర్డ్ జెండర్స్: 3,761.
18-19 ఏళ్ల యువ ఓటర్లు 5,39,804.
పురుషులు -3,11,059.
మహిళలు-2,28,625.
థర్డ్ జెండర్స్-120.