రాజధాని అమరావతిపై ఏర్పాటు చేసిన జీఎన్ రావు నిపుణుల కమిటీ తన నివేదికను సీఎం జగన్ కు సమర్పించింది. అమరావతిలోనే అసెంబ్లీ, రాజ్‌భవన్..మంత్రుల క్వార్టర్స్ ఏర్పాటు చేయాలని….విశాఖలో సీఎం క్యాంపు ఆఫీస్, సచివాలయం, వేసవి అసెంబ్లీ, హైకోర్టు బెంచ్.. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని నివేదికలో సూచించామన్నారు.
కర్నూలులో హైకోర్టు… అమరావతి, విశాఖలలో హైకోర్టు బెంచ్‌లు… ఉండాలని ఈ నివేదిక సూచించింది. శ్రీబాగ్ ఒప్పందంలో ఉన్నట్టు… హైకోర్టు కర్నూలులో ఉండాలని కమిటీ స్పష్టం చేసింది. మహారాష్ట్ర, శ్రీనగర్‌లో ఉన్నట్టుగా విశాఖపట్టణం, అమరావతి నుంచి లెజిస్లేచర్ వ్యవస్థ పనిచేయొచ్చని, ప్రతిదానికి రాజధానికి రావాల్సిన అవసరం ఉండదని తాము సూచించామని ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన జీఎన్‌రావు తెలిపారు.
రాజధానిలో ఉన్న విభాగాలను వికేంద్రీకరణ పద్ధతిలో ఏ ప్రాంతాల్లో ఏం ఉండాలన్నది తమ సూచనల్లో ఉన్నాయన్న జీఎన్ రావు, ఈ అంశంపై 2 వేల మంది రైతులతో నేరుగా మాట్లాడామన్నారు. తమకు 35 వేల సిఫారసులు వచ్చాయని చెప్పారు.
రాజధానిపై జీఎన్ రావు కమిటీ సిఫార్సులు:
* రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించాము
* పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్రాన్ని 4 రీజియన్ లుగా విభజించాలని సూచించాం
* ఉత్తర, మధ్య, దక్షిణ కోస్తా, రాయలసీమ రీజియన్ లుగా విభజరించాలి
* ఏపీలో ప్రాంతీయ అసమానతలు ఉన్నాయి
* కొన్ని ప్రాంతాలు బాగా వెనుకబడి ఉన్నాయి
* వరద ముంపులేని ప్రాంతంలో రాజధాని ఉండాలని సూచించాం
* విశాఖలో సీఎం క్యాంపు ఆఫీస్, సచివాలయం, వేసవి అసెంబ్లీ, హైకోర్టు బెంచ్
* సహజ వనరులు అన్ని ప్రాంతాలకు అందాలి
* అభివృద్ధి ఫలాలు అందరికీ దక్కాలి
* జిల్లాల్లోని అన్ని వర్గాలతో సమావేశం అయ్యాం
* తుళ్లూరులో కొన్ని జోన్లు వరద ప్రభావానికి గురవుతాయి
* ఆ ప్రాంతాల్లో తప్పు మిగతా ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలని సూచించాం
* కర్నూలులో హైకోర్టు
* అమరావతి, విశాఖలో హైకోర్టు బెంచ్ లు
* విశాఖలో వేసవి అసెంబ్లీ సమావేశాలు
* అమరావతిలో అసెంబ్లీ, రాజ్ భవన్, మంత్రుల క్వార్టర్స్