Amit Shah on kantara: కర్ణాటక అంటే ఏంటో అమిత్ షాకు ఆ సినిమా చూశాకే తెలిసిందట

కాంతార సినిమా చూశాకే తనకు కర్ణాటక సంస్కృతి గొప్పతనం తెలిసొచ్చిందని ఆయన అన్నారు. ఈ ఏడాది చివర్లో కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా అమిత్ షా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఇక రాష్ట్రంలో నిర్వహించిన ఒక ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతూ కాంతారపై ప్రశంసలు కురిపించారు.

Amit Shah on Karnataka: ఎన్నో ప్రశంసలు, అవార్డులతో దేశ వ్యాప్తంగా పేరొందిన సినిమాల్లో ఒకటి కాంతార. ఈ సినిమాతో యాక్టర్ కమ్ డైరెక్టర్ రిషబ్ షెట్టి పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. దేశంలో నలుమూలల నుంచి ఈ సినిమాకు పెద్ద ఎత్తున ప్రశంసలు అందాయి. విమర్శకులు సైతం ఔరా అన్నారు. తాజాగా ఈ సినిమా మరోసారి చర్చలోకి వచ్చింది. అయితే ఈసారి చర్చలోకి వచ్చింది సినిమా రంగంలోని వారి వల్లనో, సినీ ప్రేక్షకుల కారణంగానో కాదు.. దేశ హోంమంత్రి అమిత్ షా ఈ సినిమాను మరోసారి చర్చలోకి తీసుకొచ్చారు.

Bharat Jodo Yatra: యాత్ర నుంచి తప్పుకోనున్న రాహుల్ గాంధీ.. కారణమేంటో తెలుసా?

విషయమేంటా అంటే.. కాంతార సినిమా చూశాకే తనకు కర్ణాటక సంస్కృతి గొప్పతనం తెలిసొచ్చిందని ఆయన అన్నారు. ఈ ఏడాది చివర్లో కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా అమిత్ షా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఇక రాష్ట్రంలో నిర్వహించిన ఒక ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతూ కాంతారపై ప్రశంసలు కురిపించారు.

Rohit Sharma: రోహిత్‌కు కోపమొచ్చింది.. కెమెరా‌మెన్‌పై సీరియస్.. వీడియో వైరల్

‘‘కాంతార సినిమా చూశాను. ఈ రాష్ట్రంలో ఎంత గొప్ప సంస్కృతి ఉందో అని ఈ సినిమా చూశాకే తెలిసింది. ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ వ్యవసాయం చేస్తూ దేశాన్ని సుభిక్షంగా మార్చే ప్రాంతాలు దేశంలో చాలా తక్కువ ఉన్నాయి. ఈ సినిమాలో దానికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే కన్నడ సంస్కృతిని ప్రతిబింబించారు’’ అని అమిత్ షా అన్నారు.

ట్రెండింగ్ వార్తలు