రఘునందన్ ఇంటికి కూడా టీఆర్ఎస్ 5 పథకాలు అందుతున్నాయి : హరీశ్ రావు

  • Publish Date - November 1, 2020 / 06:59 PM IST

Dubbaka bye-elections : దుబ్బాక  ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీపై విమర్శనాస్త్రాలను సంధించారు మంత్రి హరీశ్ రావు. అభివృద్ధి పనులు చేపడుతున్న టీఆర్ఎస్‌ను నమ్ముదామా? అబద్దాల పునాదుల మీద ప్రచారం చేసే బీజేపీని నమ్ముదామా? ఆలోచించు కోవాలని సూచించారు. సొంత మనుషులు కావాలా? పరాయివాళ్లు కావాలో? ప్రజలు ఆలోచించుకోవాలన్నారు.



ప్రజలకు అబద్దాలు కాదని.. విశ్వసనీయత ముఖ్యమని చెప్పారు. మిషన్ భగీరథ నీరు, ఉచిత బియ్యం, ఉచిత విద్యుత్, పెన్షన్లు వస్తున్నది నిజం కాదా? అని అన్నారు. దుబ్బాకకు నీరు వచ్చి చెరువులు నిండింది నిజం కాదా? అని ప్రశ్నించారు. దుబ్బాకలో 60వేల ఆసరా పెన్షన్లు వస్తున్నాయని తెలిపారు.



రఘునందన్ ఇంటికి కూడా టీఆర్ఎస్ ఇస్తున్న ఐదు పథకాలు అందుతున్నాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి? చెరువు తవ్వియ్యనందుకా? తాగునీరు ఇవ్వనందుకా? రఘునందన్ రావు తండ్రికి పెన్షన్ వస్తున్నది నిజం కాదా? అని హరీశ్ రావు ప్రశ్నించారు.