గెలుపెవరిది : హుజూర్ నగర్ బరిలో 28మంది

హుజూర్ నగర్ ఉప సమరానికి సమయం దగ్గర పడింది. క్యాంపెయిన్ ముగియడంతో.. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు ప్రధాన పార్టీల నేతలు. మరోవైపు 21న పోలింగ్‌

  • Publish Date - October 20, 2019 / 02:15 AM IST

హుజూర్ నగర్ ఉప సమరానికి సమయం దగ్గర పడింది. క్యాంపెయిన్ ముగియడంతో.. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు ప్రధాన పార్టీల నేతలు. మరోవైపు 21న పోలింగ్‌

హుజూర్ నగర్ ఉప సమరానికి సమయం దగ్గర పడింది. క్యాంపెయిన్ ముగియడంతో.. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు ప్రధాన పార్టీల నేతలు. మరోవైపు 21న పోలింగ్‌ కోసం అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. హుజూర్ నగర్ ఉపఎన్నికల బరిలో 28మంది అభ్యర్ధులు నిలవగా.. వారి భవితవ్యం.. 24న తేలనుంది. తెలంగాణలో కాకరేపుతున్న హుజూర్‌నగర్ ఉపఎన్నికకు ప్రచారం ముగిసింది. ఈ నెల 21న పోలింగ్, 24న కౌంటింగ్ జరగనుంది. హుజూర్‌నగర్ బైపోల్ బరిలో మొత్తం 28 మంది అభ్యర్థులు ఉన్నారు.

ఉప ఎన్నిక పోలింగ్‌కు.. ఎలక్షన్ కమిషన్ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల 36 వేల 842 మంది ఓటర్లున్నారు. వీళ్లంతా.. 302 పోలింగ్ స్టేషన్లలో.. ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 79 పోలింగ్ కేంద్రాలను.. సమస్యాత్మకమైనవిగా ప్రకటించారు. ఉపఎన్నిక పోలింగ్‌లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 15 వేల మంది పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. ప్రచారం ముగిసే సమయానికి.. 10 కేసులు నమోదయ్యాయి. సి విజిల్ ద్వారా 15 కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఇప్పటివరకు 72 లక్షల 29 వేల నగదును సీజ్ చేశారు.

హుజూర్‌నగర్ బరిలో ప్రధాన పార్టీల అభ్యర్థులంతా ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి సైదిరెడ్డి, కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ పద్మావతి, బీజేపీ నుంచి కోట రామారావు, టీడీపీ నుంచి చావా కిరణ్మయి పోటీలో ఉన్నారు. ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచే.. ప్రధాన పార్టీలన్నీ ప్రచారంతో హోరెత్తించాయి. ఆఖరి వరకు.. విమర్శలు, ప్రతివిమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో.. క్యాంపెయిన్‌లో కాక పుట్టించారు అభ్యర్థులు. టీఆర్ఎస్ నుంచి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షోలతో.. కేడర్‌లో జోష్ నింపారు. ఫైనల్ టచ్‌గా.. సీఎం కేసీఆర్ సభ ఏర్పాటు చేసినప్పటికీ.. వర్షం కారణంగా అది రద్దైంది.

ప్రచారం జరిగినన్ని రోజులు.. టీఆర్ఎస్ మంత్రులు, నేతలంతా.. హుజూర్‌నగర్‌లోనే మకాం వేశారు. ఇక.. కాంగ్రెస్ నుంచి టీపీసీసీ నేతలంతా.. ఉత్తమ్ పద్మావతికి మద్దతుగా ప్రచారం చేశారు. సిట్టింగ్ సీటును నిలబెట్టుకునేందుకు.. హస్తం నేతలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక.. బీజేపీ అభ్యర్థిగా మద్దతుగా రాష్ట్ర నేతలంతా హుజూర్‌నగర్‌లో ప్రచారం చేశారు. అన్ని పార్టీల నాయకులు.. గెలుపుపై ధీమాతో ఉన్నారు.