2024 Elections: ప్రధాని రేసు నుంచి నితీశ్ కుమార్ తప్పుకున్నట్టేనా?

మరొకవైపు మమతా బెనర్జీ సైతం కాంగ్రెస్ లేకుండా విపక్షాల్ని ఐక్యం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కొద్ది రోజుల క్రితం ఈ విషయమై ఆమె స్పష్టమైన ప్రకటన చేశారు. కానీ, విపక్షాల ఐక్యత అంత ఈజీ కాదని ఆమె సైతం భావిస్తున్నట్లు తెలుస్తోంది

Nitish kumar

2024 Elections: విపక్షాల ఐక్యతతో ప్రధానమంత్రి అభ్యర్థిగా పోటీలో నిల్చుందామనుకున్న బిహార్ ముఖ్యమంత్రి, జనతాదశ్ యూనియన్ అధినేత నితీశ్ కుమార్ ఆశలు గల్లంతైనట్టే కనిపిస్తున్నాయి. ప్రధానమంత్రి రేసు నుంచి ఆయన తప్పుకోబుతున్నట్లు కూడా విశ్లేషణలు వస్తున్నాయి. కారణం, బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన విపక్షాల సమావేశంలో ఆయన పాల్గొని పూర్తి మద్దతు ఇచ్చారు. ఆయనే కాకుండా, ఉప ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతా దళ్ నేత తేజశ్వీ యాదవ్ సైతం సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

Kiran Kumar Reddy: అప్పటి నుంచి నా తమ్ముడి ఇంటికి నేను వెళ్లలేదు: కిరణ్ కుమార్ రెడ్డి

వాస్తవానికి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ లేకుండా విపక్షాల్ని కూడగొట్టే బాధ్యత నితీశ్ తీసుకున్నారు. ఆ విషయమై కేజ్రీవాల్, శరద్ పవార్, అఖిలేష్ యాదవ్, ఉద్ధవ్ థాకరే, అరవింద్ కేజ్రీవాల్ వంటి నేతలను సైతం కలిశారు. తాను ప్రధానమంత్రి అభ్యర్థినని నితీశ్ కుమార్ ఏనాడు ప్రత్యక్షంగా చెప్పలేదు కానీ, తేజశ్వీ యాదవ్ అయితే పలు సందర్భాల్లో బాహాటంగానే ప్రకటనలు చేశారు. కానీ, ఆచరణలో నితీశ్ ప్రయత్నాలు అంత సఫలీకృతం అయినట్లు కనిపించడం లేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్నే అంగీకరించినట్లు తెలుస్తోంది.

Rahul defamation case: రాహుల్ గాంధీ రెండేళ్ల జైలు శిక్ష స్టేపై ఉత్కంఠ.. కోర్టులో బీజేపీ ఎమ్మెల్యే కౌంటర్ పిటిషన్

ఇక మరొకవైపు మమతా బెనర్జీ సైతం కాంగ్రెస్ లేకుండా విపక్షాల్ని ఐక్యం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కొద్ది రోజుల క్రితం ఈ విషయమై ఆమె స్పష్టమైన ప్రకటన చేశారు. కానీ, విపక్షాల ఐక్యత అంత ఈజీ కాదని ఆమె సైతం భావిస్తున్నట్లు తెలుస్తోంది. విపక్షాల ఐక్యతలు ప్రాంతీయ పార్టీలు సిద్ధంగానే ఉన్నప్పటికీ ప్రధాని అభ్యర్థిత్వంపై తీవ్ర బేధాభిప్రాయాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఈ అంశంపైనే పొత్తు కుదరడం లేదని అంటున్నారు. ఇక దీదీ కూడా వచ్చే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వొచ్చని అంటున్నారు.

Karnataka Polls: బీజేపీలో చేరిన మాజీ స్పీకర్ కూతురు.. దురదృష్టకరమన్న తండ్రి తిమ్మప్ప

కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని డీఎంకే ఎప్పటి నుంచో మద్దతు ఇస్తోంది. జార్ఖండ్ పార్టీ అయిన జేఎంఎం నుంచి సైతం సంపూర్ణ మద్దతు లభించింది. ఎన్సీపీ, శివసేన (యూబీటీ) కూడా సానుకూలంగానే ఉన్నాయి. సమాజ్‭వాదీ పార్టీ మద్దతు ఇవ్వొచ్చనే అనుమానాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ లేకుండా విపక్షాల్ని ఐక్యం చేసే ప్రయత్నాలు ఫలితాన్ని ఇవ్వబోవని స్థానిక పార్టీలు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీతో చర్చలకు జేడీయూ-ఆర్జేడీ సిద్ధమై, ఏకాభిప్రాయాన్ని కుదుర్చుకున్నాయట.