Rahul defamation case: రాహుల్ గాంధీ రెండేళ్ల జైలు శిక్ష స్టేపై ఉత్కంఠ.. కోర్టులో బీజేపీ ఎమ్మెల్యే కౌంటర్ పిటిషన్

రేపటితో రాహుల్ బెయిల్ గడువు ముగియనుంది. దీంతో బీజేపీ ఎమ్మెల్యే పుర్ణేశ్ మోదీ గుజరాత్ లోని సూరత్ సెషన్స్ కోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు.

Rahul defamation case: రాహుల్ గాంధీ రెండేళ్ల జైలు శిక్ష స్టేపై ఉత్కంఠ.. కోర్టులో బీజేపీ ఎమ్మెల్యే కౌంటర్ పిటిషన్

Purnesh Modi

Rahul defamation case: రెండేళ్ల జైలు శిక్షపై స్టే కోరుతూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వేసిన పిటిషన్ ను తిరస్కరించాలని బీజేపీ ఎమ్మెల్యే పుర్ణేశ్ మోదీ గుజరాత్ లోని సూరత్ సెషన్స్ కోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. రాహుల్ గాంధీ తరచుగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, ఆయనకు ప్రత్యేక మినహాయింపు ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు.

తనకు ట్రయల్స్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్ష, దోష నిర్ధారణపై స్టే ఇవ్వాలంటూ సూరత్ లోని సెషన్స్ కోర్టును రాహుల్ గాంధీ ఆశ్రయించిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీ ఇంటి పేరును ప్రస్తావిస్తూ గతంలో రాహుల్ గాంధీ పలు వ్యాఖ్యలు చేశారు. దీంతో పరువు నష్టం కేసులో రాహుల్ ను ట్రయల్స్ కోర్టు దోషిగా తేల్చింది. రాహుల్ కు రెండు సంవత్సరాల జైలు శిక్ష పడింది.

బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేణ్ మోదీ పరువు నష్టం దావా వేసిన నేపథ్యంలో రాహుల్ కు ఈ శిక్ష పడింది. పూర్ణేశ్ మోదీ రాహుల్ తాజాగా చేసుకున్న అభ్యర్థనపై సమాధానం ఇవ్వాలని సెషన్స్ కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే పుర్ణేశ్ మోదీ… రాహుల్ గాంధీ వేసిన పిటిషన్ ను తిరస్కరించాలని కౌంటర్ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. రాహుల్ కు జైలు శిక్ష పడిన నేపథ్యంలో ఇప్పటికే లోక్ సభ సభ్యత్వంపై కూడా వేటు పడింది.

సూరత్ సెషన్స్ కోర్టులో రేపు రాహుల్ గాంధీ పిటిషన్ విచారణకు రానుంది. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సెషన్స్ కోర్టులో రాహుల్ గాంధీ అప్పీలు చేయగా, సెషన్స్ కోర్టు మధ్యంతర స్టే ఇవ్వలేదు. ఆయన బెయిల్ ను మాత్రం ఈ నెల 13 వరకు పొడిగించింది. మరోవైపు, రాహుల్ గాంధీ తో కలిసి కేరళలోని వయానాడ్ లో ఆయన సోదరి ప్రియాంక గాంధీ పర్యటించడంపై పలు ఊహాగానాలు వస్తున్నాయి. రాహుల్ గాంధీకి విధించిన శిక్షపై పైకోర్టుల్లో స్టే రాకపోతే కేంద్ర ఎన్నికల సంఘం వయానాడ్ లో ఉప ఎన్నికలు ప్రకటిస్తే ప్రియాంక గాంధీ అక్కడి నుంచి పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

Karnataka Polls: బీజేపీలో చేరిన మాజీ స్పీకర్ కూతురు.. దురదృష్టకరమన్న తండ్రి తిమ్మప్ప