అమరావతికి ఆ రోజు జగన్ ఒప్పుకున్నారు : మాజీ మంత్రి నారాయణ

రాజధానిని అమరావతి నుంచి మార్చవద్దని..అక్కడే ఉంచాలని మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణ అన్నారు. అవసరమైతే 13 జిల్లాలను అభివృద్ధి చేయాలని సూచించారు. అమరావతికి ఆ రోజు జగన్ ఒప్పుకున్నారని గుర్తు చేశారు.

  • Publish Date - December 19, 2019 / 01:16 PM IST

రాజధానిని అమరావతి నుంచి మార్చవద్దని..అక్కడే ఉంచాలని మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణ అన్నారు. అవసరమైతే 13 జిల్లాలను అభివృద్ధి చేయాలని సూచించారు. అమరావతికి ఆ రోజు జగన్ ఒప్పుకున్నారని గుర్తు చేశారు.

రాజధానిని అమరావతి నుంచి మార్చవద్దని..అక్కడే ఉంచాలని మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణ అన్నారు. అవసరమైతే 13 జిల్లాలను అభివృద్ధి చేయాలని సూచించారు. అమరావతికి ఆ రోజు జగన్ ఒప్పుకున్నారని గుర్తు చేశారు. గురువారం (డిసెంబర్ 19, 2019) ఆయన 10 టివితో ప్రత్యేకంగా మాట్లాడుతూ రాజధానిపై ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు. రాజధానిపై జగన్ ప్రకటన ప్రజల మధ్య చిచ్చు పెట్టిందన్నారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉందని విమర్శించారు. పరిపాలనా రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని కోరారు. అభివృద్ధిని పదమూడు జిల్లాలకు విస్తరించాలన్నారు. 

శివరామకృష్ణన్ కమిటీ నివేదికను వైసీపీ నేతలు పూర్తిగా చదవాలని సూచించారు. శివరామకృష్ణన్ కమిటీ రాజధానిపై నిర్ణయాన్ని ప్రభుత్వానికి వదిలేదసిందని తెలిపారు. శివరామకృష్ణన్ కమిటీ రిపోర్టులో పలాన ప్రాంతంలో రాజధానిని పెట్టాలని చెప్పలేదన్నారు. 13 జిల్లాల్లో అధ్యయనం చేసి ఎక్కడ పాజిటివ్, ఎక్కడ నెగెటివ్ అంశాలున్నాయో స్టడీ చేసి.. ఎక్కడ అన్ని రకాల వసతులుంటే అక్కడ నిర్ణయించాలని రిపోర్టులో పేర్కొన్నారని తెలిపారు. అన్ని ప్రాంతాలను స్టడీ చేసి, అన్ని రకాల ప్రజలతో చర్చించి అసెంబ్లీలో ఏపీ రాజధానిగా అమరావతిని నిర్ణయించి, అసెంబ్లీ ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు. 

అమరావతి రాజధానిపై వైసీపీ ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల నుంచి ఒక్కొక్కరు ఒక్కో స్టేమ్ మెంట్ ఇస్తూ గందరగోలం సృష్టించారని…అది కరెక్ట్ కాదన్నారు. అన్ని జిల్లాలను అభివృద్ధి చేయాలి..కానీ అడ్మినిస్ట్రేటివ్ అంతా ఒకే దగ్గర ఉంటే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందన్నారు. ఎందుకంటే ప్రజలు ఒక్కొక్క పనికి ఒక్కో దగ్గరికి పోవడం కూడా కరెక్ట్ కాదన్నారు. 1910లో సౌతాఫ్రికాకు మూడు రాజధానులు ఏర్పాటు చేశారని..డిఫరెంట్ జాతులు, డిఫరెంట్ ఏరియాలు ఉంటే ఆ రోజు అక్కడి ప్రజలు అండర్ స్టాడింగ్ తో మూడు రాజధానులను ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. ఇప్పుడు దానితో ఏపీని పోల్చడం సరికాదన్నారు. మూడు, నాలుగు రాజధానులంటూ ప్రకటనలు చేయొద్దని కోరారు. ప్రజలను గందరగోళం పర్చవద్దని, రైతులను ఇబ్బంది పెట్టవద్దని కోరారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో 11 జిల్లాల్లో 11 జాతీయ సంస్థలను పెట్టామని చెప్పారు.  

ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలను నారాయణ కొట్టిపారేశారు. తన ఫ్యామిలీలో తన కూతుళ్లు, అల్లుళ్లకు అమరావతిలో భూములు లేవని.. ఒక్క సెంట్ కూడా కొనలేదన్నారు. బంధువులు, మిత్రులు కొనుగోలు చేసి ఉండొచ్చు…కొనకుండా ఎలా ఉంటారని…అది కూడా 55 ఎకరాలేనని అన్నారు. నిజంగా తప్పు జరిగివుంటే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. కానీ రైతులను బలి చేయొద్దన్నారు. ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న జగన్ ఆ రోజు సపోర్టు చేసిన తర్వాతే అమరావతిని రాజధానిగా ప్రకటించామని తెలిపారు. మూడు, నాలుగు రాజధానులు చేయొద్దని, రైతులను ఇబ్బంది పెట్టొద్దని కోరారు.