తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు పార్టీలు రెడీ అవుతున్నాయి. మరోసారి తమ సత్తా చాటేందుకు అధికార పార్టీ TRS వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే గులాబీ బాస్ నేతలకు దిశా..నిర్దేశం చేశారు కూడా. పార్టీల మధ్య పొత్తులపై చర్చలు జరుగుతున్నాయి. కొన్ని పార్టీలు మాత్రం సొంతంగానే బరిలో దిగుతామని ప్రకటించాయి. సినీ నటుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన కూడా ఈ ఎన్నికల్లో బరిలోకి దిగబోతోంది.
అయితే..మున్సిపల్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలోకి దిగబోతున్నారు జనసేన పార్టీ కార్యకర్తలు. ఇందుకు కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పరంగా పోటీ చేయడం లేదని, ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలకు పార్టీ మద్దతుగా నిలుస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా 2020, జనవరి 08వ తేదీ ట్వీట్ చేసింది జనసేన పార్టీ.
Read More : పిన్నెల్లి తొడ గొట్టారు..ఎందుకు రెచ్చగొడుతున్నారు – నారా లోకేష్
* మున్సిపల్ ఎన్నికలకు అడ్డంకులు తొలగిపోవడంతో.. అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
* ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా… పకడ్భందీగా ఎన్నికలు నిర్వహించేందుకు పక్కా ప్రణాళికను సిద్ధం చేశారు.
* 2020, జనవరి 08వ తేదీ బుధవారం నుంచి 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.
* 2020, జనవరి 11వ తేదీన నామినేషన్లు పరిశీలిస్తారు.
* 2020, జనవరి 14న మధ్యాహ్నం 3 గంటల లోపు నామినేషన్ల ఉపసంహరించుకోవచ్చు.
* 2020, జనవరి 22న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.
* బ్యాలెట్ పేపర్ల ద్వారా ఓటింగ్ ఉంటుందని కమిషనర్ తెలిపారు.
* 2020, జనవరి 25న ఓట్ల లెక్కింపు చేపడతారు.
ఇండిపెండెంట్లుగా పోటీ చేయండి. pic.twitter.com/pUAJ8FTnU2
— JanaSena Party (@JanaSenaParty) January 8, 2020