విశాఖ లాంగ్ మార్చ్ : కన్నాకు ఫోన్ చేసిన పవన్ కళ్యాణ్

  • Publish Date - October 30, 2019 / 10:57 AM IST

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫోన్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. విశాఖ లాంగ్ మార్చ్‌‌లో పాల్గొనాలని కోరారు. సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు కన్నా. అన్ని పక్షాలను ఏకం చేయడంలో భాగంగా తొలి అడుగుగా కన్నాకు ఫోన్ చేశారు పవన్ కళ్యాణ్. 
భవన నిర్మాణ కార్మికులకు సంఘీభావంగా నవంబర్ 03వ తేదీ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్‌ తలపెట్టిన సంగతి తెలిసిందే. అన్ని పార్టీలు సంఘటితం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇప్పటికే బీజేపీ, వామపక్షాలు స్పందించాయి. మిగిలిన పార్టీలు సైతం భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితులపై పోరాడేందుకు ముందుకు రావాలన్నారు. 

Read More : విన్నపాలు వినవలె : రాజ్ నాథ్ సింగ్‌తో కేటీఆర్ భేటీ
ఏపీలో వైసీపీ ప్రభుత్వం..కొత్త ఇసుక పాలసీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇసుక కొరత ఏర్పడింది. దీనిపై విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. కార్మికులు పనులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు బాట పడుతుండడంతో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ నిర్వహించడానికి సమాయత్తం అయ్యారు. అన్ని పార్టీలు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. పేదవాడికి ఉపాధి లేకుండా..చేసి వారి ఉనికినే ప్రశ్నార్థకం చేసిన ప్రభుత్వాలను నిలదీసేందుకు, గెలిపించిన ప్రజలను ఓడిస్తున్న పాలకుల వైఖరికి నిరసనగా, భవన నిర్మాణ కార్మికులకి అండగా నవంబర్ 03న చలో విశాఖపట్టణానికి పిలుపునిచ్చింది జనసేన. 

ట్రెండింగ్ వార్తలు