మోనార్క్‌గా వ్యవహరిస్తున్న ఎల్వీ సుబ్రహ్మణ్యం  : జూపూడి

  • Publish Date - May 9, 2019 / 03:32 PM IST

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంపై టీడీపీ నాయకుడు జూపూడి ప్రభాకర్‌ మండిపడ్డారు.  ఎల్వీ సుబ్రహ్మణ్యం మోనార్క్‌గా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఎలక్షన్‌ కోడ్‌, సీఎం, సీఎస్‌, ఎన్నికల కమిషన్‌ విధులు, బాధ్యతలు, సంఘర్షణ అన్న అంశంపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన జూపూడి ప్రభాకర్‌.. ఎల్వీ సుబ్రహ్మణ్యం తీరుపై మండిపడ్డారు. ఎన్నికల కోడ్‌ పేరుతో సీఎం సమీక్షలపై ఆంక్షలు విధిస్తున్నారని తెలిపారు.