గన్నవరం విమానాశ్రయంలోకి కన్నా లక్ష్మీనారాయణకు అనుమతి నిరాకరణ 

  • Publish Date - February 10, 2019 / 05:12 AM IST

కృష్ణా : బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు అవమానం జరిగింది. గన్నవరం విమానాశ్రయంలోకి ఆయన్ను పోలీసులు అనుమతించలేదు. లిస్టులో పేరు లేదంటూ కన్నాను లోపలికి వెళ్లనివ్వలేదు. ప్రధాని మోడీ ఇవాళ గుంటూరుకు రాన్నున్న నేపథ్యంలో ఆయనకు స్వాగతం పలికేందుకు గన్నవరం విమానాశ్రయానికి వెళ్లిన కన్నాకు చేదుఅనుభవం ఎదురైంది. పోలీసుల తీరుపై కన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్నవరం విమానాశ్రయం నుంచి మోడీ గుంటూరు పర్యటనకు వెళ్లనున్నారు.