KTR fires on bandi sanjay over his remarks on KCR
KTR Attacks Bandi Sanjay: భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్‌ను లవంగం అంటూ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ తాంత్రిక పూజలు చేశాడంటూ బండి సంజయ్ వ్యాఖ్యలపై మండి పడుతూ ఆయన అలా వ్యాఖ్యానించారు. అంతే కాకుండా బండిని అలా వదిలేయవద్దని, సమాజానికి ప్రమాదకరంగా మారతాడని అన్న కేటీఆర్.. వీలైనంత తొందరలో ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రిలో చేర్పించాలని సలహా ఇచ్చారు.
శనివారం తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించిన కేటీఆర్.. ‘‘ఈ లవంగం గారిని ఇలాగే వదిలెయ్యకండి రా బీజేపీ బాబులు. పిచ్చి ముదిరి తొందర్లో కరవడం మొదలు పెడతాడేమో; మతి లేని మాటలతో సమాజానికి ప్రమాదకరంగా తయారయ్యాడు. ఎర్రగడ్డలో బెడ్ తయారుగ ఉంది. తొందరగా తీసుకెళ్లి వైద్యం చేయించుకోండి’’ అని ట్వీట్ చేశారు. బీజేపీ తెలంగాణ అధికారిక ట్విట్టర్ ఖాతాలో బండి సంజయ్ వీడియోను షేర్ చేశారు. దానిని కేటీఆర్ రీట్వీట్ చేస్తూ పై విధంగా రాసుకొచ్చారు.
ఈ లవంగం గారిని ఇలాగే వదిలెయ్యకండి రా బీజేపీ బాబులు.
పిచ్చి ముదిరి తొందర్లో కరవడం మొదలు పెడతాడేమో; మతి లేని మాటలతో సమాజానికి ప్రమాదకరంగా తయారయ్యాడు
ఎర్రగడ్డలో బెడ్ తయారుగ ఉంది. తొందరగా తీసుకెళ్లి వైద్యం చేయించుకోండి https://t.co/bCucYw6PM6
— KTR (@KTRTRS) October 8, 2022
దీనికి ముందు సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్ స్పందిస్తూ ‘‘తాంత్రిక పూజలు చేసిన కేసీఆర్.. మాంత్రికుడి సూచనల మేరకే పార్టీ పేరును మార్చుకున్నారు. అంతేగాక, కేసీఆర్ ఫాంహౌస్‌లో తాంత్రిక పూజలు చేసి కొన్ని ద్రవాలను కాళేశ్వరంలో కలిపారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలన వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు’’ అని అన్నారు. కాగా, ఈ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
Cong President Poll: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికపై తొలిసారి స్పందించిన రాహుల్ గాంధీ