Kumaraswamy: నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా.. మాజీ సీఎం ఛాలెంజ్

నేను సీఎంగా ఉన్న సమయంలో బెంగళూరు నగరంలో మౌలిక సదుపాయాల కల్పన విషయంలో గానీ, అభివృద్ధి పనుల విషయంలో గాని నేను అడ్డుకున్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా. భారీ వర్షాల అనంతరం నగర ప్రజల ఆక్రోశం నుంచి తప్పించుకునేందుకే ప్రభుత్వం కబ్జాల తొలగింపు నాటకం ప్రారంభించింది

Kumaraswamy: అధికార భారతీయ జనతా పార్టీకి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సవాల్ విసిరారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర రాజధాని బెంగళూరు నగరంలో మౌలిక సదుపాయాల కల్పనను అభివృద్ధిని అడ్డుకున్నారని వస్తున్న ఆరోపణలపై ఆయన స్పందిస్తూ.. ఈ ఆరోపణలను నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకునేందుకు సిద్ధమని ప్రకటించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

‘‘నేను సీఎంగా ఉన్న సమయంలో బెంగళూరు నగరంలో మౌలిక సదుపాయాల కల్పన విషయంలో గానీ, అభివృద్ధి పనుల విషయంలో గాని నేను అడ్డుకున్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా. భారీ వర్షాల అనంతరం నగర ప్రజల ఆక్రోశం నుంచి తప్పించుకునేందుకే ప్రభుత్వం కబ్జాల తొలగింపు నాటకం ప్రారంభించింది. అక్కడక్కడా నాలుగు కట్టడాలను బుల్డోజర్లతో కూల్చివేసి చేతులు దులుపుకోవడం కాదు, ప్రభుత్వానికి దమ్ముంటే గత పాతికేళ్లుగా రాజధానిలో చోటు చేసుకున్న అక్రమాలను సరిదిద్ది ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించేలా చూడాలి. రాజధానిలోని వర్షపీడిత ప్రాంతాల్లో మొక్కుబడిగా సహాయ కార్యక్రమాలు సాగుతున్నాయి’’ అని కుమారస్వామి అన్నారు.

Maha Polls: ‘మేమే గెలిచాం.. కాదు మేమే గెలిచాం’.. ఎన్నికల ఫలితాలపై అధికార-విపక్షాల పోటాపోటీ

ట్రెండింగ్ వార్తలు