Maha Polls: ‘మేమే గెలిచాం.. కాదు మేమే గెలిచాం’.. ఎన్నికల ఫలితాలపై అధికార-విపక్షాల పోటాపోటీ

మహారాష్ట్రలో ఆదివారం జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్న నేపథ్యంలో ఇలాంటి చోద్యాలే వనిపిస్తున్నాయి. 16 జిల్లాల్లోని 557 గ్రామ పంచాయతీలకు ఈ ఎన్నికల్లో తామే గెలిచామంటే తామే గెలిచామంటూ అధికార, విపక్ష కూటములు చెప్పుకుంటున్నాయి. బీజేపీ-శివసేన(ఏక్‭నాథ్ షిండే) కూటమి ఒకవైపు, మహా వికాస్ అగాఢి కూటమి మరొకవైపు ఎవరి లెక్కలు వారు చెప్పుకుంటూ తమ గెలుపును ప్రకటించుకుంటున్నాయి.

Maha Polls: ‘మేమే గెలిచాం.. కాదు మేమే గెలిచాం’.. ఎన్నికల ఫలితాలపై అధికార-విపక్షాల పోటాపోటీ

Maharastra panchatat polls released then parties claims their win

Maha Polls: ఆటల్లో ఎవరో ఒకరు గెలుస్తుంటారు. అయితే అప్పుడప్పుడు ఎవరూ గెలవకుండా ‘డ్రా’ అవుతూ ఉంటుంది. ఇది రాజకీయాల్లో కొంచెం కష్టమనే చెప్పొచ్చు. దాదాపుగా ఎవరో ఒకరి గెలుపు ఖాయం అవుతుంది. ఎప్పుడో కానీ డ్రా అనే సందర్భం రాదు. అయితే ఎన్నికల్లో స్పష్టమైన ఫలితాలు వచ్చినప్పటికీ తామే గెలిచామంటే తామే గెలిచామని చెప్పుకోవడం రాజకీయ పార్టీలకు అలవాటుగా మారింది. ఒకరు నంబర్లు చూపించి తామే గెలిచామంటే, మరొకరు నైతికంగా తామే గెలిచామనే స్టేట్‭మెంట్లు తరుచూ చూస్తూనే ఉంటాం.

మహారాష్ట్రలో ఆదివారం జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్న నేపథ్యంలో ఇలాంటి చోద్యాలే వనిపిస్తున్నాయి. 16 జిల్లాల్లోని 557 గ్రామ పంచాయతీలకు ఈ ఎన్నికల్లో తామే గెలిచామంటే తామే గెలిచామంటూ అధికార, విపక్ష కూటములు చెప్పుకుంటున్నాయి. బీజేపీ-శివసేన(ఏక్‭నాథ్ షిండే) కూటమి ఒకవైపు, మహా వికాస్ అగాఢి కూటమి మరొకవైపు ఎవరి లెక్కలు వారు చెప్పుకుంటూ తమ గెలుపును ప్రకటించుకుంటున్నాయి.

Congress Presidential Poll: కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసు నుంచి రాహుల్ ఔట్.. దూరంగా ఉండాలని నిర్ణయం

ఈ ఎన్నికల్లో తమ పార్టీ మద్దతిచ్చిన 259 మంది అభ్యర్థులు, ఏక్‌నాథ్ షిండే శివసేన వర్గం మద్దతిచ్చిన 40 మంది అభ్యర్థులు గెలిచారని బీజేపీ ప్రకటించుకుంది. మహారాష్ట్రలో బీజేపీ తిరిగి ‘నెంబర్ వన్ పార్టీ’ గా నిలిచిందని ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ప్రకటించారు. ఈ క్రమంలో తమదే నిజమైన శివసేన అని ప్రకటించుకుంటున్న ఉద్ధవ్ థాకరే శివసేన వర్గం, ఏక్‌నాథ్ షిండే శివసేన వర్గంతో పాటు బీజేపీకి ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. మూడు నెలల క్రితమే అధికారంలోకి వచ్చిన అధికార కూటమికి గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు మరింత ప్రతిష్ఠాత్మకంగా ఉన్నాయి. ”బీజేపీ, ఏక్‌నాథ్ షిండే శివసేన కూటమి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది. బీజేపీ తిరిగి నెంబర్ వన్ పార్టీగా నిలిచింది” అని ఫడ్నవీస్ ట్వీట్ చేశారు.

Gujarat: అరవింద్ కేజ్రీవాల్ చుట్టూ చేరి ‘మోదీ.. మోదీ..’ అంటూ నినాదాలు

కాగా, ఫడ్నవిస్ లెక్కలను విపక్ష ఎంవీఏ కూటమి కొట్టివేసింది. ఆదివారం రాత్రి వరకూ వెలువడిన 497 గ్రామ పంచాయతీల్లో బీజేపీకి 144 సీట్లు, ఎన్‌సీపీకి 126, కాంగ్రెస్ 62 సీట్లు, షిండే వర్గం 41, ఉద్ధవ్ థాకరే వర్గం 37 సీట్లు గెలుచుకున్నాయని ఎన్సీపీ నేత అజిత్ పవార్ ప్రకటించారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ కొందరు తాము నెంబర్-1 అని, నెంబర్-2 అని ప్రకటించుకుంటున్నారని, నిజానికి పార్టీ గుర్తులపై ఈ ఎన్నికలు జరగలేదనే వాస్తవాన్ని గ్రహించాలని అన్నారు. ప్రత్యర్థులు చెప్పిన నెంబర్ల ప్రకారం చూసినా, ఎంవీఏకు ఎక్కువ సీట్లు వచ్చాయని అన్నారు. ఇక, తాము 300 సీట్లు గెలుచుకున్నట్టు ఫడ్నవిస్ ప్రకటించడంపై ప్రశ్నించగా.. ‘‘ఆయన 300 సీట్లు గెలిచామని చెబితే, నేను 400 సీట్లు గెలిచామని చెబుతాను’’ అంటూ సమాధానమిచ్చారు.

Nitish Kumar: యూపీ నుంచి నితీశ్ జాతీయ పోరు.. అంబేద్కర్ నగర్ నుంచి పోటీ?