BRS Lok Sabha Candidates : బీఆర్ఎస్ రేసు గుర్రాలు రెడీ.. రేపు 6 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన

బీఆర్ఎస్ పార్టీతోనే మేలు జరుగుతుందనే టాక్ ప్రజల్లో స్టార్ట్ అయిందని కామెంట్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పట్టించుకోవద్దని, కలిసికట్టుగా పని చేయాలని నేతలకు సూచించారు కేసీఆర్.

BRS Lok Sabha Candidates : పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు వేగవంతం చేసింది. పలు స్థానాలకు గెలుపు గుర్రాలను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. రేపు 6 ఎంపీ స్థానాలకు బీఆర్ఎస్ తన అభ్యర్థులను ప్రకటించనుంది. కరీంనగర్, పెద్దపల్లి స్థానాలకు అభ్యర్థులను దాదాపు ఖరారు చేశారు గులాబీ బాస్ కేసీఆర్. కరీంనగర్ నుంచి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్ బరిలోకి దిగనున్నారని తెలుస్తోంది.

తెలంగాణ భవన్ లో కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాల నేతలతో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సమావేశం నిర్వహించారు. లోక్ సభ ఎన్నికలకు సంబంధించి నేతలకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్. ఉద్యమకాలం నుంచి సెంటిమెంట్ గా భావిస్తున్న కరీంనగర్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. కచ్చితంగా కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో బీఆర్ఎస్ గెలవబోతోందని కేసీఆర్ జోస్యం చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ ఉంటుందన్నారు కేసీఆర్.

అతి కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందన్నారు. రైతులు రోడ్డు ఎక్కే పరిస్థితి వచ్చిందన్నారు. బీఆర్ఎస్ పార్టీతోనే మేలు జరుగుతుందనే టాక్ ప్రజల్లో స్టార్ట్ అయిందని కామెంట్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పట్టించుకోవద్దని, పార్లమెంటు ఎన్నికల్లో కలిసికట్టుగా పని చేయాలని నేతలకు సూచించారు కేసీఆర్.

 

Also Read : బీజేపీ ఎంపీ అభ్యర్థుల మొదటి జాబితా.. ఆ మూడు స్థానాల్లో అసమ్మతి రాగం

 

ట్రెండింగ్ వార్తలు