టీడీపీ-జనసేన ఎంపీ అభ్యర్థులు వీరే? వైసీపీ సిట్టింగ్‌ ఎంపీలకూ టికెట్లు..!

తెలుగుదేశం-జనసేన కూటమి కూడా లోక్ సభ సీట్లను ముందుగా తేల్చేయాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే 13 స్థానాలపై క్లారిటీ రాగా, 12 స్థానాల్లో రెండు నుంచి మూడు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు.

Focus On TDP Janasena MP Candidates List

TDP Janasena MP Candidates : ఏపీ రాజకీయాలు రోజురోజుకి వేడెక్కుతున్నాయి. నిన్న ఐదో లిస్టు విడుదల చేసిన వైసీపీ.. పార్లమెంట్ సెగ్మెంట్ ఇంఛార్జ్ ల నియామకంపై ఫుల్ ఫోకస్ చేసింది. ఇప్పటివరకు 14 లోక్ సభ స్థానాలకు కొత్త సమన్వయకర్తలను నియమించింది వైసీపీ హైకమాండ్. ఇంకా 11 స్థానాలకు అభ్యర్థులు తేలాల్సి ఉంది. ఇందులో మూడు లేదా నాలుగు స్థానాలపైనే ఎక్కువగా కసరత్తు చేస్తోంది. మిగిలిన చోట్ల సిట్టింగ్ లనే కంటిన్యూ చేసే అవకాశం కనిపిస్తోంది.

ఇదే సమయంలో తెలుగుదేశం-జనసేన కూటమి కూడా లోక్ సభ సీట్లను ముందుగా తేల్చేయాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే 13 స్థానాలపై క్లారిటీ రాగా, 12 స్థానాల్లో రెండు నుంచి మూడు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. వీలైనంత తొందరగా ఈ పేర్లపైన తేల్చేయాలని భావిస్తోంది కూటమి. రెండు పార్టీలు ఉమ్మడిగానే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందంటున్నారు.

Also Read : ఉత్తరాంధ్రలో ఈసారి ఎగిరే జెండా ఏది? ఎక్కడెక్కడ ఎవరెవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి?

* టీడీపీ ఎంపీ అభ్యర్థులపై కొలిక్కి వస్తున్న కసరత్తు
* 13 స్థానాలకు అభ్యర్థులను ఒకటి రెండు రోజుల్లో ప్రకటించే ఛాన్స్
* 12 స్థానాలపై కొనసాగుతున్న కసరత్తు
* రెండు మూడు చోట్ల ఎన్ఆర్ఐ అభ్యర్థుల పేర్ల పరిశీలన
* వైసీపీ సిట్టింగ్ ఎంపీలకూ టీడీపీ-జనసేన టికెట్లు?
* రఘురామకృష్ణరాజు, బాలశౌరి, శ్రీకృష్ణదేవరాయలు, సంజయ్ కుమార్ పేర్ల పరిశీలన

టీడీపీ-జనసేన ఎంపీ అభ్యర్థులు వీరే?
విజయవాడ – కేశినేని శివనాథ్ (చిన్ని)
విశాఖపట్నం – భరత్(గీతం విద్యాసంస్థల అధినేత)
అనకాపల్లి – పోటీలో ముగ్గురు అభ్యర్థులు (బైరా దిలీప్ -పారిశ్రామికవేత్త, అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్, బుద్ధా వెంకన్న)
శ్రీకాకుళం – రామ్మోహన్ నాయుడు(సిట్టింగ్ ఎంపీ)
కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థిగా సానా సతీశ్
మచిలీపట్నం జనసేన ఎంపీ అభ్యర్థిగా ఎంపీ వల్లభనేని బాలశౌరి
నరసరావుపేట నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు పేరు దాదాపు ఖరారు?
విజయనగరంలో బీసీలనే బరిలో నిలిపే యోచనలో టీడీపీ అధిష్టానం

Also Read : 3 సార్లు ఓడినా నాల్గోసారి పట్టువదలని విక్రమార్కుడిలా.. పోటీలోకి చలమలశెట్టి సునీల్.. పూర్తి వివరాలు..

అరకు- కిడారి శ్రావణ్ కుమార్ పేరు పరిశీలన
అమలాపురం – గంటి హరీశ్(మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి కుమారుడు), సత్యశ్రీ పేర్ల పరిశీలన
రాజమండ్రి – తీవ్రమైన పోటీ, రేసులో హేమాహేమీలు(బొడ్డు వెంకటరమణ చౌదరి(రాజానగరం ఇంఛార్జి), కంభంపాటి రామ్మోహన్ రావు, ఎన్ఆర్ఐ యనమదల రవి పేర్లు పరిశీలన)
ఏలూరు – గోపాలకృష్ణ యాదవ్(ఎన్ఆర్ఐ, సింగపూర్ లో ఐటీ కంపెనీలు)
నర్సాపురం-రఘురామకృష్ణ రాజు
గుంటూరు – ఎన్ఆర్ఐ పెమ్మసాని చంద్రశేఖర్, భాష్యం రామకృష్ణ(భాష్యం విద్యా సంస్థల అధినేత)
బాపట్ల – ఉండవల్లి శ్రీదేవి లేదా మాదిగ సామాజికవర్గ నేతకు ఛాన్స్
ఒంగోలు లేదా నెల్లూరు స్థానాల నుంచి మాగుంట శ్రీనివాస్ రెడ్డి
తిరుపతి – పనబాక లక్ష్మి, మాజీ ఐఏఎస్ రత్నప్రభ కుమార్తె అంగలకుర్తి నిహారిక పేర్లు పరిశీలన
చిత్తూరు – సత్యవేడు మాజీ ఎమ్మెల్యే తలారి ఆదిత్య లేదా ఆదిమూలం పేర్లు పరిశీలన
రాజంపేట – రాయచోటి మాజీ ఎమ్మెల్యే పాలకొండ రాయుడు కుమారుడు సుబ్రమణ్యం పేరు పరిశీలన
కడప – టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి
కర్నూలు – సంజీవ్ కుమార్ లేదా బీజేపీ నేత పార్థసారథి పేరు పరిశీలన
నంద్యాల- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి లేదా ఆయన కుమార్తె శబరి పేర్ల పరిశీలన
నంద్యాల – రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రసాద్ రెడ్డి, పారిశ్రామికవేత్త గోగిశెట్టి నరసింహారావు పేర్ల పరిశీలన
అనంతపురం – పూల నాగరాజు లేదా కాల్వ శ్రీనివాసులు
హిందూపురం- బీకే పార్థసారథి

నెల్లూరు- వైసీపీ నుంచి ఆఖరి నిమిషంలో వచ్చే ఎంపీకు టికెట్? ఖాళీగా ఉంచిన చంద్రబాబు..

 

 

ట్రెండింగ్ వార్తలు