Delhi Ordinance Bill: లోక్‭సభ ఆమోదం పొందిన ఢిల్లీ ఆర్డినెన్స్.. రాజ్యసభ కూడా గట్టెక్కినట్టే

రాజ్యసభలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌, బీజేడీలకు చెరో తొమ్మిది మంది సభ్యులున్నారు. అదే సమయంలో, ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ (ఇండియా) కూటమికి చెందిన పార్టీల నుంచి 101 మంది ఎంపీలు మాత్రమే రాజ్యసభలో ఉన్నారు.

Parliament Monsoon Session: ఢిల్లీలో సేవల హక్కుకు సంబంధించిన బిల్లును మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. గతంలో ఉన్న బిల్లకు కొన్ని మార్పులు చేసి తాజా బిల్లును ప్రవేశపెట్టారు. ఇంతకు ముందు ఉన్న ఆర్డినెన్స్ స్థానంలో ఢిల్లీ సర్వీసెస్ బిల్లును తీసుకువచ్చారు. దీనికి అధికారికంగా గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) బిల్లు 2023 అని పేరు పెట్టారు. ఇప్పటికే ఈ బిల్లు గురువారం లోక్‭సభ ఆమోదం పొందింది. మూజువాణి ఓటు ద్వారా ఈ బిల్లు ఆమోదం పొందింది. అయితే రాజ్యసభ ఆమోదం కూడా సులువుగానే పొందుతుందని మోదీ ప్రభుత్వం విశ్వసిస్తోంది. అయితే రాజ్యసభలో బిల్లు ఫ్లాప్ అవుతుందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సహా కొన్ని ప్రతిపక్షాలు చెబుతున్నాయి.

Kunwar Danish Ali: అలా అయితే ప్రతి మసీదు కింద గుడి ఉంటుందట.. జ్ఞాన్‌వాపి మసీదు అంశంపై బీఎస్పీ ఎంపీ

ఈ బిల్లును ఆప్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కాగా ఆ పార్టీకి పలు విపక్షాల మద్దతు లభించింది. ముఖ్యంగా కొత్తగా ఏర్పడ్డ ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ సహా అన్ని పార్టీ మద్దతు లభించింది. అయినప్పటికీ ఈ బిల్లు పాసవుతుందని అంటున్నారు. కారణం టీడీపీ, బీజేడీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు బిల్లుకు పార్లమెంట్‌లో మద్దతు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై వైసీపీ తన అభిప్రాయాల్ని ముందుగానే వెల్లడించింది. అయితే బీజేడీ మౌనంగా ఉన్నప్పటికీ చాలా కాలంగా బీజేపీకి పార్లమెంటులో మద్దతు ఇస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజా బిల్లుకు కూడా మద్దతు లభిస్తుందని అంటున్నారు. ఇక టీడీపీ సైతం బిల్లుకు మద్దతు ఇవ్వనుందట.

Haryana: భయానక పరిస్థితులకు వణికిపోయి.. కిలోమీటర్ల మేర నడుచుకుంటూ సొంత ప్రాంతానికి..

రాజ్యసభలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌, బీజేడీలకు చెరో తొమ్మిది మంది సభ్యులున్నారు. అదే సమయంలో, ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ (ఇండియా) కూటమికి చెందిన పార్టీల నుంచి 101 మంది ఎంపీలు మాత్రమే రాజ్యసభలో ఉన్నారు. ఏడుగురు బీఆర్‌ఎస్‌ సభ్యులు, స్వతంత్ర సభ్యుడు కపిల్‌ సిబల్‌ మద్దతుతో బిల్లును వ్యతిరేకిస్తున్న సభ్యుల సంఖ్య 109కి చేరింది. అదే సమయంలో ఎన్డీయేకు 111 మంది సభ్యులు ఉన్నారు. వీరికి తోడు బీజేడీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు చెందిన 18 మంది సభ్యులను కలుపుకుంటే బిల్లుకు మద్దతిచ్చే సభ్యుల సంఖ్య 129కి చేరనుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉభయ సభల్లో ఢిల్లీ సర్వీసెస్ బిల్లు ఆమోదం పొందేందుకు ప్రభుత్వానికి మార్గం సులువుగా కనిపిస్తోంది.