#BudgetSession2023: అదానీ గ్రూప్ వ్యవహారంపై పార్లమెంటులో హంగామా

రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ ‘‘మోదీ పాలనలో చట్టబద్ధత, ప్రజాస్వామ్యం లేదు. అదానీ స్టాక్స్ ఇష్యూపై జేపీసీ రాజ్యాంగాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. మేము ఈ సమస్యను లేవనెత్తినప్పుడు, మైకులు స్విచ్ ఆఫ్ చేస్తున్నారు. సభలో గందరగోళం చెలరేగుతుంది’’ అని మండిపడ్డారు.

#BudgetSession2023: అదానీ గ్రూప్ వ్యవహారంపై పార్లమెంటులో సోమవారం హంగామా కొనసాగింది. హిండెన్ బర్గ్ రిపోర్ట్ అనంతరం అదానీ ఆస్తులు ఒక్కసారిగా కుప్పకూలిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై జేపీసీ ఏర్పాటు చేయాలని విపక్షాలు పట్టుపట్టాయి. కానీ ఇందుకు ప్రభుత్వం అంగీకరించలేదు. దీనికి ప్రతిగా రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలంటూ అధికార పక్ష నేతలు డిమాండ్ చేశారు. అధికార విపక్షాల పోటాపోటీ నినాదాల మధ్య సభ పార్లమెంటులోని ఇరు సభలు వాయిదా పడ్డాయి.

Bombay HC: టైరు పేలడం దేవుడి మహిమ కాదు కదా.. కంపెనీని రూ.1.25 కోట్లు ఇవ్వమన్న కోర్టు

బడ్జెట్ రెండవ విడత సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. కాగా, ఇరు సభలు ప్రారంభమైన కాసేపటికే వాయిదా పడడం గమనార్హం. విపక్షాలు ముందు నుంచే అదానీ వ్యవహారంపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు సిద్ధమయ్యాయి. అనుకున్నట్టుగానే సభ కార్యకలాపాలు ప్రారంభం కాగానే ఆ అంశాన్ని లేవనెత్తాయి. అయితే ప్రభుత్వం సైతం దీనికి ముందుగానే అస్త్రాలు సిద్ధం చేసి పెట్టుకుంది. వాళ్లు రాహుల్ గాంధీ అంశాన్ని లేవనెత్తి విపక్షాల్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు.

Amit Shah..’Washing Powder Nirma’ : ‘వాషింగ్ పౌడర్ నిర్మా’యాడ్‌తో అమిత్‌షా స్వాగ‌తం..!

రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ ‘‘మోదీ పాలనలో చట్టబద్ధత, ప్రజాస్వామ్యం లేదు. అదానీ స్టాక్స్ ఇష్యూపై జేపీసీ రాజ్యాంగాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. మేము ఈ సమస్యను లేవనెత్తినప్పుడు, మైకులు స్విచ్ ఆఫ్ చేస్తున్నారు. సభలో గందరగోళం చెలరేగుతుంది’’ అని మండిపడ్డారు.

ట్రెండింగ్ వార్తలు