Congress President Poll: గాంధీ కుటుంబం అండతో నామినేషన్ వేసిన మల్లికార్జున ఖర్గే

ఖర్గే ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రెండుసార్లు లోక్‌సభ సభ్యునిగా విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. గతంలో కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా పని చేశారు. ఆయనకు వయసు రీత్యా కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. అయితే మధుమేహం, గుండె సంబంధిత రుగ్మతలు లేవు. మోకాలి చిప్పను మార్చడంతో నడవాలంటే ఎవరో ఒకరి సహాయం అవసరమవుతుంది.

Congress President Poll: గాంధీ కుటుంబం మద్దతుతో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక బరిలోకి దిగిన మల్లికార్జున ఖర్గే శుక్రవారం నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఈ పదవికై పోటీలో ఉన్న శశి థరూర్ ఇప్పటికే నామినేషన్ వేశారు. ఒక పోటికి దిగుతానని ప్రకటించిన దిగ్విజయ్ సింగ్.. పోటీ నుంచి తప్పుకోవడంతో ఖర్గే వర్సెస్ థరూర్ అన్నట్లుగా కాంగ్రెస్ ఎన్నిక జరగబోతోంది. వచ్చే నెల 17న ఈ ఎన్నికలు జరుగుతాయి.

వాస్తవానికి ఈరోజు నామినేషన్లకు చివరి రోజు. కొన్ని హైడ్రామాల నడుమ చిట్ట చివరి క్షణంలో మల్లికార్జున ఖర్గే అభ్యర్థిత్వం తెరపైకి రావడం అందరినీ ఆశ్చర్యపరచింది. 2020లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాసిన 23 మంది నేతల్లో చాలా మంది మల్లికార్జున ఖర్గేకు మద్దతు ప్రకటించారు. ఆ లేఖపై తమతోపాటు సంతకం చేసి, ప్రస్తుతం ఎన్నికల బరిలో నిలిచిన శశి థరూర్‌కు ‘చెయ్యి’చ్చారు. దీనంతటికీ కారణం.. ఖర్గేకు గాంధీ కుటుంబం అండదంటలు ఉండడమే. గెహ్లాట్ తప్పుకోవడంతో ఖర్గేను గాంధీ కుటుంబమే తెరపైకి తెచ్చిందని బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.

ఖర్గే ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రెండుసార్లు లోక్‌సభ సభ్యునిగా విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. గతంలో కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా పని చేశారు. ఆయనకు వయసు రీత్యా కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. అయితే మధుమేహం, గుండె సంబంధిత రుగ్మతలు లేవు. మోకాలి చిప్పను మార్చడంతో నడవాలంటే ఎవరో ఒకరి సహాయం అవసరమవుతుంది.

Congress President Poll: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల నుంచి వైదొలిగిన దిగ్విజయ్ సింగ్.. పోటీలో ఖార్గే, శశిథరూర్

ట్రెండింగ్ వార్తలు