Bajrang Dal: బజరంగ్ దళ్ కాంట్రవర్సీని మరో లెవెల్‭కి తీసుకెళ్లిన మనోజ్ ఝా.. హనుమంతుడు కనుక ఇప్పుడు ఉండుంటే వారి చెంపలు పగలగొట్టేవాడట

బీజేపీ దాడితో కాంగ్రెస్ కొంత మెత్తబడి యూటర్న్ తీసుకుంది. తమ మేనిఫెస్టోలో బజరంగ్ దళ్ పేరును రాడికల్ సంస్థగా పేర్కొన్నామే కానీ, రద్దు చేస్తామని చెప్పలేమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలీ గురువారం వివరణ ఇచ్చారు

Bajrang Dal: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో బజరంగ్ దళ్ సంస్థ మీద నిషేధం విధిస్తామని ఇచ్చిన హామీతో రాజకీయ ప్రకంపనలు చెలరేగుతున్నాయి. ఈ వివాదాన్ని బజరంగ్ భలీ (హనుమంతుడు)తో ముడిపెట్టి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ మరో స్థాయికి తీసుకెళ్లారు. ముదట ‘జై శ్రీరాం’ నినాదాలను అడ్డుకున్నారని, ఇప్పుడు ఏకంగా బజరంగ్ భలీనే తొలగిస్తున్నామంటున్నారంటూ ఎన్నికల ప్రచారంలో చెబుతున్నారు.

Uttar Pradesh: యూపీలో మరో భారీ ఎన్‭కౌంటర్.. మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‭స్టర్ అనిల్ దుజానాను హతమార్చిన టాస్క్‭ఫోర్స్ పోలీసులు

ఈ వివాదం భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీల మధ్య తీవ్ర మాటల యుద్ధానికి దారి తీసింది. అయితే బీజేపీ దాడితో కాంగ్రెస్ కొంత మెత్తబడి యూటర్న్ తీసుకుంది. తమ మేనిఫెస్టోలో బజరంగ్ దళ్ పేరును రాడికల్ సంస్థగా పేర్కొన్నామే కానీ, రద్దు చేస్తామని చెప్పలేమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలీ గురువారం వివరణ ఇచ్చారు. ఈ వివాదం ఇంతటితో చల్లబడుతుందనే లోపు రాష్ట్రీయ జనతా దళ్ నేత, ఎంపీ మనోజ్ ఝా చేసిన వ్యాఖ్యలు మరో మలుపుకు తిప్పాయి.

Karnataka Polls: ‘బజరంగ్ భలి’ దెబ్బకు మాట మార్చిన కాంగ్రెస్.. ‘బజరంగ్ దళ్’‭ను బ్యాన్ చేస్తామని అనలేదంటూ బుకాయింపు

కలియుగంలో కనుక బజరంగ్ భలి (హనుమంతుడు) ఉండుంటే.. బజరంగ్ దళ్ వారికి ఒక్కొక్కరికి 20 చెంప దెబ్బలు వేసేవాడని అన్నారు. భారతీయ జనతా పార్టీ వచ్చాక దేవుళ్లను మతాన్ని రాజకీయాల్లోకి లాగడం విపరీతంగా పెరిగిపోయిందని, ప్రజాస్వామ్య ఎన్నికల్లో ప్రజల సమస్యల గురించి మాట్లాడకుండా ప్రజల విశ్వాసాలతో రాజకీయం చేయడమేంటని ఆయన ప్రశ్నించారు. మోదీకి అంత ఇష్టం ఉంటే ‘జై బజరంగ్ దళ్’ అని అరమంటూ సలహా ఇచ్చిన ఆయన.. బజరంగ్ భలిని మాత్రం రాజకీయాల్లోకి లాగొద్దని అన్నారు. ఇప్పటికే ఈ వివాదం దేశాన్ని కుదిపివేస్తుంది. పైగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల గడువు మరింత సమీపింది. ఈ తరుణంలో మనోజ్ ఝా చేసిన వ్యాఖ్యలు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు