మావోయిస్టు పార్టీలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఎన్నోఏళ్లుగా కీలక నేతగా కొనసాగిన కేంద్ర కమిటీ కార్యదర్శి గణపతి వైదొలగడంతో… ఆ పదవిని గతంలో నంబాల కేశవరావుకు అప్పగించారు. ఆయన శ్రీకాకుళం జిల్లాకు చెందినవాడు. ప్రస్తుతం మావోయిస్టు సెంట్రల్ కమిటి సెక్రటరీగా పని చేస్తున్ననంబాల కేశవరావు నేతృత్వంలో… తాజాగా 21 మంది సభ్యులతో కూడిన నూతన కేంద్ర కమిటీ జాబితా విడుదల చేసింది మావోయిస్టు పార్టీ. ఈ లిస్ట్‌లో తెలంగాణకు చెందిన 10 మంది నేతలకు అధిక ప్రాధాన్యత కల్పించారు.
పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి ఇద్దరు చొప్పున… జార్ఖండ్ నుంచి నలుగురు, బీహార్ నుంచి ఒక్కరిని కేంద్ర కమిటిలోకి తీసుకున్నారు. వరుస ఎన్‌కౌంటర్లలో చాలామంది మావోయిస్టులు చనిపోయారు. మరికొంతమంది స్వచ్ఛందంగా లొంగిపోయారు. ఈ పరిస్థితుల్లో మళ్లీ మావోయిస్టు పార్టీని బలోపేతం చేయడం కోసం కేంద్రం కమిటీ నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి సీపిఐ మావోయిస్టు పార్టీలో కీలకనేతగా ఎదిగాడు.
ప్రస్తుతం గణపతి కేంద్ర కమిటిలో ప్రధాన భూమిక పోషిస్తున్నాడు. మల్లోజుల వేణుగోపాల్, కటకం సుదర్శన్, మల్లా రాజిరెడ్డి, విప్పర్తి తిరుపతి, అక్కిరాజు హరగోపాల్, గాజర్ల రవి, పుల్లూరి ప్రసాద్‌రావు, మోడెం బాలకృష్ణ, హనుమంతులతో కూడిన 21 మంది సభ్యులను కేంద్ర కమిటిలోకి తీసుకున్నారు. ఇందులో తెలంగాణ నుంచి పదిమందికి చోటివ్వడం హాట్‌టాపిక్‌గా మారింది.
గణపతి వారసుడిగా మావోయిస్టు పార్టీ సారథ్య బాధ్యతలు తీసుకున్న నంబాల కేశవరావుపై 2005లోనే 50 లక్షల రివార్డ్ ప్రకటించింది అప్పటి ప్రభుత్వం. ప్రస్తుతం 21 మంది సభ్యులతో కేంద్ర కమిటి వేసిన కేశవరావు… మావోయిస్టు పార్టీని బలంగా తయారు చేయాడానికి అన్ని విధాలుగా పావులు కదుపుతున్నారు. కేంద్ర కమిటిలో తెలంగాణకు అధిక ప్రాధాన్యత కల్పించడంతో పోలీస్ శాఖ అలర్ట్ అయ్యింది.
Read More : గెలుస్తారా : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ – జనసేన పోటీ