ఏపీలో రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. ఎన్నికలకు సమయం సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. జంపింగ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఈ
హైదరాబాద్: ఏపీలో రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. ఎన్నికలకు సమయం సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. జంపింగ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఈ పార్టీలోని వారు ఆ పార్టీలోకి, ఆ పార్టీలోని వారు ఈ పార్టీలోకి జంప్ చేస్తున్నారు. నెల్లూరు రాజకీయాల్లో ఇలాంటి పరిణామమే చోటు చేసుకుంది. నెల్లూరు టీడీపీకి షాక్ తగిలింది. టీడీపీ సీనియర్ నేత, వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి సొంత బావ షాక్ ఇచ్చారు. సోమిరెడ్డి బావ, కావలికి చెందిన టీడీపీ నేతలు కేతిరెడ్డి రామకోటారెడ్డి, ఆయన కుమారుడు శశిధర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019, జనవరి 23వ తేదీ బుధవారం హైదరాబాద్ లోటస్ పాండ్‌లో వైసీపీ చీఫ్ జగన్ సమక్షంలో వారు వైసీపీలో జాయిన్ అయ్యారు. వారికి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు జగన్.
ఇప్పటికే అమెరికాలో వైసీపీ తరుఫున రామకోటారెడ్డి కుమారుడు శశిధర్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. సోమిరెడ్డి టీడీపీలో సీనియర్ నేత. సీఎం చంద్రబాబుకి సన్నిహితుడు. అలాంటి నేత బంధువులు ప్రతిపక్షంలో చేరడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. టీడీపీ శ్రేణులను విస్మయానికి గురి చేసింది.
ఎన్నికల వేళ వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్‌కి తెరతీసిందని చెప్పొచ్చు. అధికార పార్టీలో అసంతృప్త నేతలను, టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులను జగన్ తమవైపు తిప్పుకుంటున్నారు. ఇప్పటికే కడప జిల్లా రాజంపేటకు చెందిన టీడీపీ నేత మేడా వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే.
* మంత్రి సోమిరెడ్డికి షాక్
* వైసీపీలో చేరిన మంత్రి సోమిరెడ్డి బావ రామకోటారెడ్డి, అల్లుడు శశిధర్ రెడ్డి
* కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వైఎస్ జగన్
* అమెరికాలో వైసీపీ తరఫున ప్రచారం చేస్తున్న రామకోటా రెడ్డి కుమారుడు శశిధర్ రెడ్డి