ప్లాస్టిక్ వినియోగాన్నితగ్గించి పర్యావరణాన్ని కాపాడటానికి మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే కొత్త ఆలోచన చేశారు. తన నియోజక వర్గంలో ప్రతి ఇంటికి ఒక జ్యూట్ చేతి సంచిని పంపిణీ చేయాలని నిర్ణయిుంచుకున్నారు. అందులో భాగంగా శనివారం నవంబర్ 16న తన నియోజకర వర్గంలోని మిద్దే సెంటర్లో ఆయన జ్యూట్ చేతి సంచులను ప్రజలకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంగళగిరిని ప్లాస్టిక్ రహిత మంగళగిరిగా తీర్చిదిద్దుకుందామని ప్రజలకు సూచించారు. ప్లాస్టిక్ సంచుల వాడకం మానేసి.. జ్యూట్ సంచులను మాత్రమే ఉపయోగించాలని కోరారు. పర్యావరణ పరిరక్షణకు అంతా కృషి చేయాలన్నారు. నవంబర్ 17 నుంచి నియోజక వర్గంలో ఇంటి ఇంటికీ జ్యూట్ సంచులను పంపిణీ చేయనున్నారు.