MLAs Saurabh Bharadwaj, Atishi to be elevated as ministers
Delhi Govt: ఇటీవలే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, అంతకు ముందే మనీలాండరింగ్ కేసులో అరెస్టై జైలు జీవితం గడుపుతున్న సత్యేంద్ర జైన్ తమ మంత్రి పదవులకు మంగళవారం రాజీనామా చేశారు. కాగా వారి స్థానంలో ఆప్ ఎమ్మెల్యేలు సౌరభ్ భరద్వాజ్, అతిషిలను మంత్రులుగా తన కేబినెట్లోకి తీసుకోవాలని ఢిల్లీ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి పేర్లను ఇప్పటికే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నరుకు సీఎం కేజ్రీవాల్ పంపినట్లు సమాచారం. వీరికి మొదటి నుంచి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తున్న ఆయన.. సర్దుబాటు దృష్ట్యా ప్రభుత్వంలోకి తీసుకోలేకపోయారు. అయితే తాజా ఖాళీలతో ఇద్దరినీ మంత్రివర్గంలోకి తీసుకోవాలని అనుకున్నట్లు తెలుస్తోంది.
Chicken Arrested: వ్యక్తి మృతి కేసులో కోడి అరెస్టు, తొందరలోనే కోర్టు ముందు హాజరు
మనీశ్ సిసోడియాను వారం రోజుల క్రితం కేంద్ర దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేయగా, సత్యంద్ర జైన్‌ను పోయిన ఏడాది మే నెలలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. వేరు వేరు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ ఇద్దరిలో ఒకరు జైలులో ఉండగా, మరొకరు సీబీఐ కస్టడీలో ఉన్నారు. సత్యేంద్ర జైన్ ఢిల్లీ ఆరోగ్య, జైల్ల శాఖ మంత్రి కాగా, ఎక్కువ సుమారు 18 మంత్రిత్వ శాఖలతో అతిపెద్ద పోర్టుఫోలియో ఉన్న మంత్రి సిసోడియా ఉన్నారు. ఆర్థిక శాఖ, విద్యా శాఖ వంటి కీలక శాఖలు సిసోడియా వద్దనే ఉన్నాయి. ఈ రెండు శాఖల్ని మంత్రులు కైలాష్ గెహ్లాట్, రాజ్ కుమార్ ఆనంద్‌లకు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
Unemployment Rate: దేశంలో 6.4 శాతం నుంచి 7.5 శాతానికి పెరిగిన నిరుద్యోగం
మనీశ్ సిసోడియాకు తొందరలోనే న్యాయస్థానం ద్వారా జైలు శిక్ష పడొచ్చని అంటున్నారు. ఇప్పటికే ఒక మంత్రి సుదీర్ఘ కాలంగా జైలు జీవతం గడుపుతున్నారు. ఇక తాజాగా కేజ్రీవాల్ తర్వాత పార్టీ, ప్రభుత్వంలో కీలకంగా ఉన్న సిసోడియాకు జైలు ఖరారైతే ఆమ్ ఆద్మీ పార్టీకి అతిపెద్ద సవాలు అని అంటున్నారు. రెండు లేదంటే అంతకంటే ఎక్కువ జైలు శిక్షే సిసోడియాకు పడనున్నట్లు తెలుస్తోంది. అయితే వచ్చే వారంలో ఢిల్లీ బడ్జెట్ ప్రవేశ పెట్టాల్సి ఉంది. అయితే కొద్ది రోజుల ముందే బడ్జెట్ దృష్ట్యా విచారణల నుంచి తనకు విముక్తి కల్పించాలని సిసోడియా పెట్టుకున్న అభ్యర్థనకు సీబీఐ అంగీకరించింది. అయితే రెండు రోజులకే ఆయనను అరెస్ట్ చేయడం గమనార్హం.