Chicken Arrested: వ్యక్తి మృతి కేసులో కోడి అరెస్టు, తొందరలోనే కోర్టు ముందు హాజరు
కొండపూర్కు చెందిన సత్తయ్య (45) అనే వ్యక్తి మూడు రోజుల క్రితం పందెం కోడి కాలికి కత్తి కట్టాడు. తను పెంచుకున్న కోడి తన ప్రాణాలే తీసింది. కోడి కాలికి కట్టిన కత్తి పొరపాటున పొట్టలో గుచ్చుకోవడంతో సత్తయ్య మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, సత్తయ్య మృతికి కారణమైన కోడిని అరెస్ట్ చేశారు

chicken arrested in man's death case
Chicken Arrest: ఆ మధ్య ఒకసారి కోడి మృతి కేసు దేశంలో చర్చనీయాంశమైంది. తన పొరుగింటి వ్యక్తి దురుద్దేశంతో కుట్రపన్ని తన కోడిని హతమార్చాడంటూ తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడంతో అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్య పరిచింది. అయితే దీనికి పూర్తిగా భిన్నమైన ఘటన తెలంగాణలో జరిగింది. ఒక వ్యక్తి మృతి కేసులో పోలీసుల కోడిని అరెస్ట్ చేశారు. జగిత్యా జిల్లా వెలగటూరు మండలం కొండాపూర్లో జరిగిన ఘటన ఇది.
Malegaon Court: వింతైన తీర్పు ఇచ్చిన మాలేగావ్ కోర్టు.. ముద్దాయి రోజుకు ఐదు సార్లు నమాజ్ చేయాలట
కొండపూర్కు చెందిన సత్తయ్య (45) అనే వ్యక్తి మూడు రోజుల క్రితం పందెం కోడి కాలికి కత్తి కట్టాడు. తను పెంచుకున్న కోడి తన ప్రాణాలే తీసింది. కోడి కాలికి కట్టిన కత్తి పొరపాటున పొట్టలో గుచ్చుకోవడంతో సత్తయ్య మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, సత్తయ్య మృతికి కారణమైన కోడిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు.. సత్తయ్య మృతికి కోడే ఏ-1 ముద్దాయిగా చేర్చి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. ఇక కోడిని తొందరలోనే కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు కూడా వారు పేర్కొన్నారు.
Amritpal Singh: ఖలిస్తాన్ నేత అమృపాల్ సింగ్కు ఐఎస్ఐ నుంచి నిధులు వస్తున్నట్లు అనుమానాలు