విజయవాడ: వైసీపీ అధినేత జగన్ పై హత్యాయత్నం కేసు, ఏపీ హై కోర్టులో బుధవారం విచారణ జరిగింది. జగన్ పై దాడి కేసులో ఏ మెటీరియల్ ఆధారంగా ఎన్ఐఏ విచారణకు అంగీకరించిందో తెలపాలని గతంలో హై కోర్టు ఆదేశించడంతో ఎన్ఐఏ అధికారులు బుధవారం కౌంటర్ దాఖలు చేశారు. తమ వాదనలు వినిపించుకునేందుకు ప్రభుత్వం మరింత గడువు కోరింది. దీంతో కేసు విచారణను కోర్టు ఫిబ్రవరి 12 కి వాయిదా వేసింది.
ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఎన్ఐఏ కు ఇవ్వాలని సిట్ అధికారులను హై కోర్టు ఆదేశించినప్పటికీ వారిలో ఎలాంటి చలనం లేదు. హైకోర్టు తుది తీర్పు వచ్చేంతవరకు ఎన్ఐఏ కు సహకరించేది లేదని ప్రభుత్వం ఖరాఖండిగా ప్రకటించింది.