ఇది కన్ఫామ్ : మంగళగిరి నుంచే లోకేష్ పోటీ

ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఎన్నికల బరిలో ఎక్కడి నుండి పోటీ చేస్తారో కన్ఫామ్ అయిపోయింది.

  • Publish Date - March 13, 2019 / 09:03 AM IST

ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఎన్నికల బరిలో ఎక్కడి నుండి పోటీ చేస్తారో కన్ఫామ్ అయిపోయింది.

ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఎన్నికల బరిలో ఎక్కడి నుండి పోటీ చేస్తారో కన్ఫామ్ అయిపోయింది. నియోజకవర్గ స్థానంపై బాబు తీవ్ర కసరత్తే చేశారనిపిస్తోంది. చివరకు గుంటూరు జిల్లాలోని మంగళగిరి అసెంబ్లీ స్థానం ఖరారు చేశారు. కొద్ది రోజుల కిందట 10tv కూడా ఇదే చెప్పింది. స్థానిక నేతలు, ఇతర కీలక నాయకులతో సంప్రదింపులు, చర్చలు జరిపిన అనంతరం లోకేష్ పోటీకి బాబు లైన్ క్లియర్ చేశారు. డైరెక్ట్ అటాక్ చేసేందుకు లోకేష్ రెడీ అయ్యారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా, మంత్రిగా ఉన్న లోకేష్..ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.
Read Also : ఎందుకిలా : వైసీపీ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ వాయిదా

పోటీపై తీవ్ర కసరత్తు : 
ఏపీ మంత్రిగా ఉన్న నారా లోకేష్ పోటీ చేసే స్థానంపై ఎన్నో వార్తలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. భీమిలి నుండి..అని..విశాఖ నుండి అని..ఇతర నియోజకవర్గాల నుండి పోటీ చేస్తారని గుసగుసలు వినిపించాయి. ఏ మాత్రం తేడా వచ్చినా రాజకీయ భవిష్యత్‌పై నీలి నీడలు కమ్ముకొనే పరిస్థితి వస్తుంది కనుక…పోటీ చేసే స్థానంపై తీవ్ర కసరత్తు జరిపారు. చివరకు గుంటూరు జిల్లా మంగళగిరి అయితే బెటర్ అని బాబు నిర్ణయం తీసుకుని..తెలుగు తమ్ముళ్లకు సమాచారం అందచేశారు. 

మంగళగిరి ఎందుకు ? 
అమరావతి రాజధాని ప్రాంతం మంగళగిరి. 2014 ఎన్నికల్లో వైసీపీ చేతిలో 12 ఓట్ల తేడాతో ఓడిపోయిన టీడీపీ 1985 నుండి మంగళగిరి స్థానంలో ఎన్నడూ గెలవలేదు. ఈసారి చరిత్రను తిరిగరాసేందుకు పక్కా ప్లాన్‌తో టీడీపీ బరిలోకి దిగుతోంది. నియోజకవర్గ పరిధిలో ఐటీ కంపెనీలున్నాయి. ఇంకా ఐటీ కంపెనీలు వస్తాయని టీడీపీ ప్రభుత్వం చెబుతోంది.
Read Also : నారా Vs నార్నే నిజమేనా : లోకేష్ ను ఢీ కొట్టేది ఎవరు

ఐటీ మంత్రిగా నారా లోకేష్ పనిచేయడం..లాభిస్తుందని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. భవిష్యత్‌లో గ్రేటర్ అమరావతిగా రాజధాని ప్రాంతం మారనుండడం..గ్రేటర్ అమరావతిలో తిరుగులేని నాయకుడిగా ఎదిగే ఛాన్స్ ఉండడంతో మంగళగిరిని ఎంపిక చేశారని తెలుస్తోంది. మరి లోకేష్…విజయం సాధించి చరిత్ర సృష్టిస్తారా ? లేదా ? అనేది చూడాలి. 

మంగళగిరి నుంచి ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా ఆళ్ల రామకృష్ణారెడ్డి ఉన్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి 1983, 1985 మినహా టీడీపీ ఎమ్మెల్యే లేని నియోజకవర్గంగా మంగళగిరి ఉంది. పొత్తుల్లో భాగంగా ప్రతి ఎన్నికల్లోనూ వామపక్షాలు, బీజేపీకి మంగళగిరి స్థానాన్ని కట్టబెడుతూ వచ్చిన టీడీపీ…1985 తర్వాత 2014లో మంగళగిరిలో పోటీ చేసింది. అత్యధికంగా బీసీ ఓటర్లు ఉన్న నియోజకవర్గం మంగళగిరి.
Read Also : షాకింగ్ : దగ్గుబాటికి టికెట్ పై జగన్ డైలమా!