NDA Vs INDIA: పోటాపోటీగా కూటములు.. ఇంతకీ ఎన్నికల పోటీలో ఎవరి బలం ఎంత?

ఎన్డీయే కూటమి ప్రధాని అభ్యర్థి ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్రమోదీయే. కానీ, ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరనేది అంత తొందరగా కొలిచ్చి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అసలు ఎన్నికలకు ముందు ఈ నిర్ణయం జరిగే అవకాశాలు కూడా లేవనే అనిపిస్తోంది

2024 Elections: విపక్షాలు ఇండియా (I.N.D.I.A) అనే పేరుతో కూటమి కట్టాయి. వాస్తవానికి గతంలోని యూపీఏ కంటే కూడా ఈ కూటమి చాలా బలంగా కనిపిస్తోంది. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ సైతం ఎన్డీయేను మరింత బలోపేతం చేస్తోంది. చిత్రంగా ఈ రెండు కూటముల సమావేశాలు ఒకే రోజున జరిగాయి. విపక్షాలు బెంగళూరులో సమావేశం కాగా, ఎన్డీయే సమావేశం దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. ఇటు 26 విపక్ష పార్టీలు సమావేశం కాగా, అటు 38 ఎన్డీయే పార్టీలు సమావేశం అయ్యాయి.

Delhi : ప్రేమించాడని.. పట్టపగలు నడిరోడ్డుపై అంతా చూస్తుండగానే దారుణ హత్య, ఒళ్లుగగుర్పొడిచే వీడియో

అయితే.. పోటాపొటీగా బలోపేతం అవుతున్న ఈ కూటముల్లో వచ్చే ఎన్నికల్లో ఎవరి బలం ఎంత అనే దానిపై అప్పుడే విశ్లేషణలు జోరందుకున్నాయి. దేశంలో బీజేపీ, కాంగ్రెస్ బలమైన పార్టీలుగా ఉన్నాయి. మరే పార్టీ ఈ రెండు పార్టీల సరిహద్దులో కూడా లేదు. అయితే ఎన్డీయే కూటమి బీజేపీ నాయకత్వంలోనే ఉండగా.. ప్రస్తుతం ఏర్పాటైన కూటమిలో కాంగ్రెస్ పార్టీకి అంత బలం లేదు. ఎన్డీయేలో సీట్ల సర్దుబాటు, ప్రధానమంత్రి అభ్యర్థి సులువుగానే జరిగే అవకాశం ఉంది. కానీ, ఇండియా కూటమిలో ఇవే అసలు సవాళ్లుగా మారే అవకాశం ఉంది.

Wrestlers protest: ఆసియన్ గేమ్స్‌‌లో ఆడనున్న భజరంగ్ పునియా, వినేశ్ ఫొగట్!

అయితే కూటముల అంతర్గతంగా జరిగే విషయాల్ని పక్కన పెడితే ఇరు పార్లమెంట్, అసెంబ్లీల్లో ఓట్లు, సీట్లను బట్టి ఈ రెండు కూటముల బలాబలాలపై చర్చ జరుగుతోంది. వీటి ఆధారంగా వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపోటముల గురించి చర్చ జరుగుతోంది. మరి ఇప్పటి పరిస్థితి ప్రకారం.. ఎవరి బలం ఎంతుందో ఒకసారి పరిశీలిద్దామా?

2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 37.36 శాతం ఓట్లు సాధించింది. ఇక 543 సీట్లలో బీజేపీ ఒక్కటే 303 సీట్లు గెలిచింది. బీజేపీ మిత్రపక్షాలతో కలిపితే 332 సీట్లు ఉన్నాయి. ఇక ఓట్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ సైతం గట్టి ప్రభావమే చూపించింది. ఆ పార్టీకి 19.49 శాతం ఓట్లు వచ్చాయి. అయితే సీట్ల వరకు వచ్చే సరికే హస్తం పార్టీ ఢీలా పడింది. కేవలం 52 సీట్లు మాత్రమే గెలుచుకుంది. దీనికి తోడు ప్రస్తుతం కూటమి కట్టిన మిగిలన పార్టీల ఓట్లు కలుపుకున్నప్పటికీ ఒక్క బీజేపీ ఓటు బ్యాంకుకు సమీపంలోనే ఉంటుంది.

I-N-D-I-A: మెగా విపక్ష సమావేశం అనంతరం.. ఇండియా (I-N-D-I-A) కూటమి నేతలు ఏమన్నారంటే?

ఇక సీట్ల విషయంలో ఇండియా కూటమి చాలా వెనుకబడి ఉంది. మొత్తం పక్షాల సీట్లు కలుపుకున్నా 150 కంటే తక్కువే ఉన్నాయి. ఇది లోక్‭సభ లెక్కలు కాగా, రాజ్యసభ పరిస్థితి దాదాపు ఇలాగే ఉంది. ఎన్డీయేకు రాజ్యసభలో 111 మంది ఎంపీలు ఉండగా.. ఇండియా కూటమి బలం 70కి అటు ఇటుగానే ఉంది. అయితే రాష్ట్రాల అసెంబ్లీ విషయంలో ఇండియా కూటమి చాలా బలంగా ఉంది. దేశంలో మొత్తం 4,036 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ఎన్డీయే వద్ద కేవలం 1,745 స్థానాలు మాత్రమే ఉండగా.. ఇండియా కూటమికి 2 వేలకు పైగానే స్థానాలు ఉన్నాయి.

ఇండియా కూటమికి అసెంబ్లీలో ఉన్న పట్టు పార్లమెంటులో లేదు. కొంత కాలంగా జరుగుతున్న ఎన్నికల్లో కూడా ఈ విషయం స్పష్టంగానే కనిపిస్తోంది. స్థానిక ప్రభుత్వంలో ఒక పార్టీని ఎంచుకుంటున్న ప్రజలు.. జాతీయ స్థాయిలో మరో పార్టీని ఎంచుకుంటున్నారు. 2018లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‭గఢ్ రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినప్పటికీ.. ఆ తర్వాత కేవలం 6 నెలలకే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బొక్కబోర్లా పడింది. ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీ వైట్ వాష్ చేసేసింది.

SC-ST Youth Nude Protest: ఛత్తీస్‭గఢ్‭లో దారుణ ఘటన.. ప్రభుత్వం తమకు అన్యాయం చేస్తోందంటూ ఏమాత్రం బట్టలు లేకుండా రోడ్డు మీదకు వచ్చిన యువకులు

ఇక స్థానిక పార్టీలు అధికారంలో ఉన్న ప్రాంతాల్లో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. పశ్చిమ బెంగాల్, ఒడిశా, తెలంగాణ, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్నప్పటికీ.. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి మంచి ఫలితాలు వచ్చాయి. వాస్తవానికి ఆయా రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో ఏమాత్రం సంబంధం లేని ఫలితాలు అవి.

హిందీ బెల్టులో ఇప్పటికీ బీజేపీదే ఆధిపత్యం
ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‭గఢ్, బిహార్, హర్యానా వంటి ఉత్తరాది హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో ఇప్పటికీ భారతీయ జనతా పార్టీదే ఆధిపత్యం కొనసాగుతోంది. వీటికి తోడు గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాలు కూడా సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ సీట్లను ఇచ్చాయి. పైగా ఈ రాష్ట్రాల నుంచే లోక్‭సభలో ఎక్కువ సీట్లు ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో బీజేపీ పట్టు కోల్పోతే కానీ, ఇండియా కూటమి అనుకున్న ఫలితం ఆశించడం కష్టం. అయితే యూపీ, హర్యానా, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో బీజేపీ ఇప్పటికే అధికారంలో ఉంది.

బిహార్ రాష్ట్రంలో బీజేపీ బలంగా ఉంది. ఇక రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‭గఢ్ రాష్ట్రాల్లో తొందరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎంత మేరకు ప్రభావం చూపుతాయో తెలియాలి. పైగా ఈ రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సమ ఉజ్జీలుగా పోటీలో ఉన్నాయి. దీనికి తోడు ఈశాన్య రాష్ట్రాల్లో కూడా బీజేపీ బాగా పుంజుకుంది. లోక్‭సభ, అసెంబ్లీ తేడా లేకుండా అక్కడ బీజేపీ ఆధిపత్యం చెలాయిస్తోంది.

బీజేపీని ఢీకొట్టే విపక్షాల బలం ఇండియా కూటమికి అవకాశం
వాస్తవానికి.. బీజేపీని సమర్థవంతంగా ఎదుర్కొంటున్న ప్రాంతీయ పార్టీలైన టీఎంసీ, ఆర్జేడీ, డీఎంకే, ఆప్ వంటి పార్టీలు ఇండియా కూటమిలో ఉండడం కలిసి వచ్చే అవకాశమని చెప్పొచ్చు. వీరితో పాటు జేఎంఎం, జేడీయూ, జేకేఎన్సీ, పీడీపీ వంటి పార్టీల బలం కూడా ఇండియా కూటమికి మరింత బలం ఇస్తుంది. వీటిని కనుక కాంగ్రెస్ పార్టీ సరిగ్గా సర్దుబాటు చేయగలిగితే వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికల్లో ఇండియా కూటమి మంచి ఫలితాలు చూసే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం ఉన్న సీట్లు, ఓట్ల పరంగా వీరి బలం ఎంతైనప్పటికీ.. ఈ అందరూ ఒక చోట చేరినప్పుడు ఆ ప్రభావం ఓటర్లపై పెద్ద స్థాయిలో ఉంటుందని ఎప్పటి నుంచో అంచనాలు ఉన్నాయి.

ఇండియా కూటమికి ప్రధాని అభ్యర్థి సమస్య
వాస్తవానికి ఏ ఎన్నికకైనా కాబోయే పాలక నాయకుడు ఎరనేది చాలా ముఖ్యం. ఇది లేకపోవడం వల్ల అనేక సందర్భాల్లో ఓటములు చవి చూడాల్సి వస్తుంది. ఎన్డీయే కూటమి ప్రధాని అభ్యర్థి ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్రమోదీయే. కానీ, ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరనేది అంత తొందరగా కొలిచ్చి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అసలు ఎన్నికలకు ముందు ఈ నిర్ణయం జరిగే అవకాశాలు కూడా లేవనే అనిపిస్తోంది. ఇది ఇండియా కూటమిని దెబ్బతీసే అవకాశం ఉంది. అధికార పార్టీ ఈ విషయాన్ని ఎన్నికల అస్త్రంగా మలుచుకుంటే విపక్షాలు బొక్కబోర్లా పడడం ఖాయం.

బీజేపీ 10 ఏళ్ల పాలన కలిసి వచ్చే అవకాశం
ఏ పార్టీ పాలనైనా 10 ఏళ్లు అంటే వ్యతిరేకత అధికమవుతుంది. వాస్తవానికి మోదీ ప్రభుత్వం కొంత కాలంగా తీవ్ర వ్యతిరేకత ఎదుర్కుంటోంది. రైతుల ఆందోళన, నిరుద్యోగుల ఆందోళన అధికార పార్టీ మెడలు వంచిందనే చెప్పవచ్చు. వాస్తవానికి బీజేపీ ఎన్నో అవకాశాలు ఇచ్చినప్పటికీ విపక్షాలు సరిగా వాడుకోలేదు. అలా అని ప్రజలు గుర్తించకుండా ఉండరు. ఒకప్పటితో పోల్చుకుంటే బీజేపీ మీద వ్యతిరేకత పెరిగింది. మోదీ పాలన 10 ఏళ్లు పూర్తైంది. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన ఎన్నో హామీలు మరుగున పడ్డాయి. వీటికి తోడు దేశంలో భిన్న వర్గాల మధ్య వవాదాలు పెరిగాయి. నిరుద్యోగం, అధిక ధరలు వంటివి ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఈ లెక్కన ఇండియా కూటమికి ఈ ఎన్నికలు కొంత సానుకూలంగానే ఉన్నట్లు కనిపిస్తోంది.

ఏది ఏమైనప్పటికీ.. సమర్ధవంతమైన ప్రచారంతో ప్రజల్ని ఆకట్టుకోలిగినప్పుడే కూటముల గెలుపోటములు నిర్ణయించబడతాయి. అటు ఎన్డీయేకు కొన్ని అవకాశాలు ఉన్నాయి, ఇటు ఇండియా కూటమికీ కొన్ని అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇరు వర్గాల వైపు కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. ఎవరైతే ఎక్కువ లోపాల్ని సవరించుకుని ఎన్నికల భూమికలో బలంగా ఉంటారో వారిది గెలుపుంటుందని అనేక సందర్భాలు చెప్పాయి. మరి ఎన్డీయే, ఇండియా కూటముల్లో గెలుపుగుర్రాలు ఎవరంటే వచ్చే ఎన్నికల వరకు ఎదురు చూడాల్సిందే.